పార్ట్‌ టైం స్వీపర్ల వెట్టి చాకిరి

ABN , First Publish Date - 2022-12-10T00:48:45+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైం స్వీపర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. నెలకు రూ. 4 వేల వేతనంతో ఏళ్ల తరబడి పాఠశాలల్లో పార్ట్‌ టైం స్వీపర్లుగా పనిచేస్తు న్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 73 మంది పార్ట్‌ టైం స్వీపర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.

పార్ట్‌ టైం స్వీపర్ల వెట్టి చాకిరి

- చాలీచాలని వేతనంతో ఆర్థిక ఇక్కట్లు

- పర్మనెంట్‌ కాని ఉద్యోగాలు

- దయనీయ పరిస్థితుల్లో పాఠశాల పార్ట్‌ టైం స్వీపర్లు

జగిత్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైం స్వీపర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. నెలకు రూ. 4 వేల వేతనంతో ఏళ్ల తరబడి పాఠశాలల్లో పార్ట్‌ టైం స్వీపర్లుగా పనిచేస్తు న్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 73 మంది పార్ట్‌ టైం స్వీపర్లు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వారికి వచ్చే వేతనాలు కుటుంబ సభ్యుల క డుపు నింపకపోయినప్పటికీ ఏ నాటికైనా తమకు ప్రభుత్వం ఉద్యోగ భ ద్రత కల్పించకపోతుందా అన్న ఆశతో పనిచేస్తున్నారు. పేరుకే పార్ట్‌ టైం స్వీపర్‌ అయినప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లోనే ఉంటూ సేవలందిస్తున్నారు. నెల రోజులు కష్టపడితే వారికి వచ్చే వేతనం కుటుంబ పోషణ నిమిత్తం కిరాణ దుకాణాల్లో తెచ్చుకున్న సరుకులకు సై తం సరిపోని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బా గు పడుతాయని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిం చే ప్రతీ సౌకర్యం కల్పిస్తారని ఆశపడ్డప్పటికీ వారి సమస్యలను పట్టించు కునే నాథుడు కరువవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

చుట్టుముడుతున్న సమస్యలు..

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైం స్వీపర్ల ను పలు సమస్యలు చుట్టుముడుతున్నాయి. చాలీచాలని వేతనంతో పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. ఒకవైపు ఉ ద్యోగాలు పర్మనెంట్‌ కాకపోవడం, ప్రభుత్వం అందిస్తున్న వేతనం ఏమూ లకు సరిపోకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడంతో ఆహార భద్ర తా కార్డు పొందడానికి గాని, ఆసరా పింఛన్‌కు గాని అర్హత లేకపోవ డం, మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులకు అందే ఇతర సదుపాయాలు ఏవీ అంద కపోవడం తదితర సమస్యలతో పార్ట్‌ టైం స్వీపర్లు సతమతమవు తున్నా రు. నెలకు రూ. 4 వేతనం మినహా ప్రభుత్వం నుంచి ఇతర ఎలాంటి స హకారం అందకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఉద్యోగేతరు లకు ప్రభుత్వం కల్పించే ఇతర సంక్షేమ కార్యక్రమాలకు అనర్హు లుగా ఉండడంతో నిరాశ చెందుతున్నారు. సంవత్సరాల తరబడి పార్ట్‌ టైం స్వీప ర్లుగా పనిచేస్తూ రిటైర్‌మెంట్‌కు దగ్గరవుతున్నప్పటికీ ఉద్యోగాలు పర్మనెం ట్‌ కాకపోవడంతో అసంతృప్తితో కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైం స్వీపర్ల సమస్యలను పరి ష్కరిం చాలని కోరుతున్నారు.

30 ఏళ్లుగా పనిచేస్తున్నా రూ. 4 వేలే జీతం

ప్రభుత్వ పాఠశాలలో గత ముప్పయి ఏళ్లుగా పనిచేస్తున్నాను. ప్రభు త్వం కేవలం రూ. 4 వేల వేతనం అందిస్తోంది. పాఠశాలలో పొద్దున నుం చి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తోంది. పేరుకే పార్ట్‌ టైం అంటున్నా రు. పని సాయంత్రం వరకు ఉంటోంది. ప్రభుత్వం నుంచి వేతనం మినహా ఇతర సదుపాయాలు అందడం లేదు.

పార్ట్‌ టైం స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వం పార్ట్‌ టైం స్వీపర్ల సమస్యను పరిష్కరించాలి. పాఠశాలల్లో పార్ట్‌ టైం స్వీపర్లుగా పనిచేస్తుండడం వల్ల ప్రైవేటు వ్యక్తులకు అందే ప్ర భుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టు ముడుతున్నాయి. చాలీచాలని వేతనాలతో సంవత్సరాల తరబడి పనిచే స్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదు.

Updated Date - 2022-12-10T00:48:52+05:30 IST