పండిత్‌ దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-26T05:44:53+05:30 IST

పండిత్‌ దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకో వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ అన్నారు.

పండిత్‌ దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
మొక్కలు నాటుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ

మెట్‌పల్లి, సెప్టెంబరు 25: పండిత్‌ దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకో వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ అన్నారు. ఆది వారం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిత్‌ దీన్‌ దయా ళ్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దీన్‌దయాళ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని 18 వ వార్డులో మొక్కలు నాటారు. వ్యక్తి వికాసం, సమాజహితం, విశ్వమా నవ కళ్యాణమే లక్ష్యంగా దీన్‌దయాళ్‌ పనిచేశారన్నారు. ఇదిలాఉండగా బీ జేపీ రాష్ట్ర ఐటీ, సోషల్‌ మీడియా సెల్‌ జాయింట్‌ కన్వినర్‌గా నియమి తులయిన మిట్లపల్లి సాయికుమార్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మెట్‌పల్లి బీజేపీ పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్‌, బీజేపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్‌ జెఎన్‌ వెంకట్‌, రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు సాంబారి ప్రభాకర్‌, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్‌, నిజామాబాద్‌ పార్లమెంట్‌ కో కన్వినర్‌ సదాశివ, నాయకు లు సుఖేందర్‌ గౌడ్‌, మన్నె గంగాధర్‌ పాల్గొన్నారు.

Read more