పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి కన్నుమూత

ABN , First Publish Date - 2022-12-28T23:48:07+05:30 IST

పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారఽథి (91) ఇక లేరు. కరీంనగర్‌ శ్రీపురంలోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు.

పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి కన్నుమూత

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 28: పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారఽథి (91) ఇక లేరు. కరీంనగర్‌ శ్రీపురంలోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. మార్చి 10, 1936న గోప మాంబ-నరసింహాచార్య దంపతులకు జన్మించిన విజయసారథి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ఆశువుగా కవిత్వం చెప్పేవారు.ఆయనకు కుమారుడు శ్రీభాష్యం వరప్రసాద్‌, కోడలు కల్యాణి, మనుమరాళ్ల శ్రీవత్స, వాజ్ఞ్మయి ఉన్నారు.

మందాకిని కవిగా ప్రసిద్ధి చెందిన విజయసారథి సంస్కృత రచనాంశాలు విదేశాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఆయన సుమారు 150కి పైగా సంస్కృత, తెలుగు గ్రంథాలు రచించారు. ఆయన రచించిన మందాకిని, భారతభారతి కావ్యాలు పేరు తెచ్చాయి. రవీంద్రనాథ్‌ఠాగూర్‌ రచించిన గీతాంజలిని సంస్కృ తంలోకి అనువాదం చేశారు. 1980లో సర్వ వైదిక సంస్థానం, 1986లో యజ్ఞ వరాహక్షేత్రాన్ని స్థాపిం చారు. వరంగల్‌ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో 40 సంవత్సరాలపాటు ప్రొఫెసర్‌గా పని చేశారు. విజయసారథి నవంబరు 8, 2021 నాడు పద్మశ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతు ల మీదుగా స్వీకరించారు. విజయసారథి అంత్య క్రియలు బుధవారం సాయంత్రం ఇరుకుల్ల శ్మశాన వాటికలో జరిగాయి.

పలువురి నివాళి

మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, మాజీ కేంద్ర మంత్రి సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఫోన్‌ ద్వారా విజయసారథి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అడిషన ల్‌ కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, సీపీ సత్యనారా యణ, మాజీ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సుడా చైర్మన్‌ జీవి రామకృష్ణారావు నివాళులర్పించారు.

Updated Date - 2022-12-28T23:48:09+05:30 IST