సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2022-10-08T05:27:32+05:30 IST
సమస్యలపై అధికారులు దృష్టి సారించినప్పుడే అవి పరిష్కారమవుతాయని ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి అన్నారు.
మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
రాయికల్, అక్టోబరు 7: సమస్యలపై అధికారులు దృష్టి సారించినప్పుడే అవి పరిష్కారమవుతాయని ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి అన్నారు. ఎం పీపీ అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్యసమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 4నెల లు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయకపోవడం ఏం టని భూపతిపూర్ సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు ముత్యుంరెడ్డి ప్రశ్నించా రు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు, కల్వర్టులు చెడిపో యాయని మరమ్మతులు చేపట్టాలని ఎంపీటీసీ దొంతి నాగరాజు అధికా రుల దృష్టికి తీసుకువెళ్లారు. భూపతిపూర్, రామాజీపేట గ్రామాల మధ్య ఉన్న చెరువు నీరు, ఆదాయ వనరులపై ఇరు గ్రామాలకు సమాన హక్కు కల్పించాలని భూపతిపూర్ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ ఇరిగేషన్ అధికా రుల దృష్టికి తీసుకువెళ్లారు. భూపతిపూర్, రామాజీపేట గ్రామాలలో విద్యార్థుల సంఖ్య ఉన్నప్పటికీ ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపడంతో విద్యార్థులు నష్టపోతున్నారని తక్షణం డిప్యూ టేషన్‌లు రద్దు చేయాలని వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రావు, రామాజీపేట ఎంపీటీసీ ఆకుల మహేష్‌లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కట్కాపూ ర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టు తిరిగి నిర్మిం చాలని సర్పంచ్ రాజమౌళి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మిషన్ భగీరథ వల్ల రోడ్లన్నీ దెబ్బతిని రాత్రి వేళ ప్రమాదాలు జరుగుతున్నాయని సమస్యను పరిష్కరించాలని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావైద్యంపై ప్రధాన దృష్టి సారించి మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా నిధులు కేటాయించి పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తుందని అన్నారు. స మావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై నివేదిక అందించాలని అధి కారులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కు మార్, డిప్యూటీ తహసీల్దార్ అనీల్‌కుమార్, వైద్యులు ప్రవీణ్‌చంద్ర, పీఆర్ ఏఈ వెంకటప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగి ల్‌విండో చైర్మన్‌లు పాల్గొన్నారు.