నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2022-09-09T05:09:59+05:30 IST

సిరిసిల్ల మానేరు వాగులో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను గురువారం రాత్రి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే గురువారం పరిశీలించారు

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
మానేరు వాగులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

సిరిసిల్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):  సిరిసిల్ల మానేరు వాగులో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను గురువారం రాత్రి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి,  ఎస్పీ రాహుల్‌ హెగ్డే  గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో మానేరు వాగు, వేములవాడలో గుడిచెరువుతోపాటు మండలాలు, గ్రామాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సీసీ కెమెరాలను కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. గతం కంటే ఈ సారి వినాయక విగ్రహాలు ఎత్తయినవి ఏర్పాటు చేశారన్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా  జరుపుకోవాలని తెలిపారు. అత్యవసరపరిస్థితుల్లో స్థానిక పోలీస్‌ అధికారులకు, డయల్‌ 100కు కాల్‌ చేయాలన్నారు.  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ విశ్వప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సీఐ అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, వార్డు కౌన్సిలర్‌ వెల్దండి దేవదాస్‌, తదితరులు ఉన్నారు. 

ఆకట్టుకున్న తిరుమల సెట్టింగ్‌ 

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం చివరి రోజుల సిరిసిల్లలోని గీతానగర్‌,  విద్యానగర్‌ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరుమల కొండ సెట్టింగ్‌ అందరిని అకట్టుకుంది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే బస్సు రూట్‌, మెట్ట మార్గాలతోపాటు ఏడు కొండలను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహకుడు జిందం దేవదాస్‌ మాట్లాడుతూ ఏటా నవరాత్రి ఉత్సవాల్లో దైవ దర్శనాలకు సంబంధించిన సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Read more