అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-09-20T05:36:44+05:30 IST

అధికారుల పనితీరు ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సూచించారు.

అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి
వైకుంఠరథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

- ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ముత్తారం సెప్టెంబరు 19:  అధికారుల పనితీరు ప్రభుత్వానికి,  ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సూచించారు.   మండ లంలోని అడవిశ్రీరాంపూర్‌లో సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులతో వైకుంఠరథం, బాడీ ఫ్రీజర్‌ మంజూరు కాగా వాటిని ఎమ్మెల్యే  చేతుల మీదుగా సోమవారం ప్రారం భం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రవర్ణాలకు బడుగు, బలహీన వర్గాలు అన్న భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ముందుకు వెళ్తుందోన్నా రు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో సబ్‌ స్టేషన్‌, ఖమ్మంపల్లి నుంచి అడవి శ్రీరాంపూర్‌ వరకు రింగ్‌ రోడ్డు, సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, హై స్కూల్‌, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, అదర్శ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల ఇచ్చిన ఘనత కాంగ్రేస్‌దే అన్నారు. మంథనిలోని ప్రస్తుతం స్థానిక  రాజకీయ నేతల్లో రౌడీయిజం.. గుండాయిజం నడుస్తోందని రానున్న రోజుల్లో ప్రజాలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. తాను ఒకటి మాట్లాడితే... వారికి అనుకులంగా ఉన్న పత్రికలో వారికి అనుకులంగా ప్రచురించుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే  ఇసుక అక్రమ మాఫియాను అరికట్టాలని, అంతేకా కుండా ఇసుక ద్వారా వచ్చిన సీనరీ నిధులను ఈ ప్రాంతానికి ఉపయోగించాలన్నారు. ఇసుక క్వారీల్లో ఇసును తూకం వేయకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళ్లడంతో గ్రామాల్లో రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి శ్రీధర్‌బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, జిల్లా ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, మైనార్టీ సెల్‌ నాయకుడు వాజిద్‌ పాషా,  కాంగ్రేస్‌ పార్టీ మంథని మండల అధ్యక్షుడు సెగ్గేం రాజేషం, నాయకులు తోట చంద్రయ్య, అకోజు అశోక్‌, మండల రవి, శశి కుమార్‌, దాసరి చంద్రమౌళి, తాళ్లపల్లి విష్టుగౌడ్‌, కోల్ల విజయ్‌, గాదం శ్రీనివాస్‌, రాపెల్లి సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-20T05:36:44+05:30 IST