ముగిసిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ABN , First Publish Date - 2022-10-17T05:35:59+05:30 IST
జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి.
కరీంనగర్ స్పోర్ట్స్, అక్టోబరు 16: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి జంప్స్, త్రోస్ విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అథ్లెటిక్స్ ట్రాక్ వర్షం నీటితో నిండిపోవడంతో రన్నింగ్ పోటీలను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశామని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, కడారి రవి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభచాటిన క్రీడాకారులను ఈ నెల 22, 23 తేదీల్లో హన్మకొండలోని జేఎన్‌ఎం స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎం చంద్రశేఖర్, హరికిషన్, పీడీలు హరినాథ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.