హెల్త్‌ ప్రొఫైల్‌ను మానిటరింగ్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-03-05T05:40:14+05:30 IST

జిల్లాలోని అన్ని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభమయ్యే హెల్త్‌ ప్రొపై ల్‌ను మెడికల్‌ అధికారులతో సమన్వయం చేసు కోవా లని, తహసీల్దార్లు మానిటరింగ్‌ చేయ డంతోపాటు మండలాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమ స్యలను సంబంధిత తహసీల్ధార్‌లు ఎప్పటికప్పుడు పరి‘ష్కరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అదేశిం చారు.

హెల్త్‌ ప్రొఫైల్‌ను  మానిటరింగ్‌ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 4: జిల్లాలోని అన్ని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభమయ్యే హెల్త్‌ ప్రొపై ల్‌ను మెడికల్‌ అధికారులతో సమన్వయం చేసు కోవా లని, తహసీల్దార్లు  మానిటరింగ్‌ చేయ డంతోపాటు మండలాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమ స్యలను సంబంధిత తహసీల్ధార్‌లు ఎప్పటికప్పుడు పరి‘ష్కరించాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అదేశిం చారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం రాత్రి తహసీల్దార్లతో రెవెన్యూ సమస్యలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ  అన్ని మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులు, కోర్టు కేసులను పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టా లన్నారు. అక్వాహాబ్‌కు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొంతమందిని కలిసి సమూహంగా ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీవో లీలా, కలెక్టరేట్‌ ఏవో గంగయ్య, సిరిసిల్ల తహసీల్ధార్‌ విజయ్‌కుమార్‌, పర్యవేక్షకులు రవికాంత్‌, శ్రీకాంత్‌, సుజాత, సుధీర్‌, అన్నీ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:40:14+05:30 IST