యువతకు స్ఫూర్తి నరేంద్రమోదీ

ABN , First Publish Date - 2022-09-28T05:27:21+05:30 IST

యువతకు దేశ ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తి అని రాజ్యసభ సభ్యుడు, ఓబీిసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ అన్నారు.

యువతకు స్ఫూర్తి నరేంద్రమోదీ
సమావేశంలో మాట్లాడుతున్న కె లక్ష్మణ్‌

- రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌

కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 27: యువతకు దేశ ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తి అని రాజ్యసభ సభ్యుడు, ఓబీిసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ అన్నారు. మంచిర్యాలలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన మార్గమధ్యలో మంగళవారం కరీంనగర్‌ మహాశక్తి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు,  బండి సంజయ్‌కుమార్‌తో కలసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దీక్షలో ఉన్న బండి సంజయ్‌ను పలకరించి పోదామని వచ్చానని అన్నారు. కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు సంజయ్‌ ఆలయాన్ని నిర్మించిన తొలినాళ్ళలో ఇక్కడికి వచ్చానని,త ఇప్పుడు ఆలయం బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఆంజనేయస్వామి, అయ్యప్ప, భవానీ దీక్షలను యువత ఎక్కువగా తీసుకుంటుండడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ, తాళ్ళపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Read more