రాజన్న క్షేత్రంలో నేడు ముక్కోటి ఏకాదశి
ABN , First Publish Date - 2022-01-13T05:58:36+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది.
వేములవాడ, డిసెంబరు 12 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం తెల్లవారుజామున 3-00 గంటలకు మంగళవాయిద్యములు, 3-10 గంటల నుంచి సుప్రభాత సేవ, 3-35 గంటల నుంచి సుప్రభాత దర్శనం, 3-50 గంటల నుంచి ప్రాతఃకాల పూజ, 5-00 నుంచి స్వామివారల పల్లకీసేవ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.10 గంటల నుంచి పార్వతీరాజరాజేశ్వరస్వామివారు, లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలు పల్లకీసేవపై ఉత్తర ద్వారం వద్ద దర్శనమిస్తారు. అనంతరం తూర్పు భాగంలోని రాజగోపురం వద్ద ముక్కోటి ఏకాదశి విశిష్టత, ప్రవచనము, మహా హారతి, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఉంటాయి. కొవిడ్ నిబంధల మేరకు భక్తులను ఉత్సవాలకు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గర్భాలయంలో అభిషేకం, అన్నపూజ రద్దు చేశామని పేర్కొన్నారు.