అధికారులు మాట తప్పారని ధర్నా

ABN , First Publish Date - 2022-10-18T04:54:51+05:30 IST

తమ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు మాట ఇచ్చి తప్పారని కలెక్టరేట్‌ ఎదుట హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితులు సోమవారం ధర్నా నిర్వహించారు.

అధికారులు మాట తప్పారని ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట దర్నా చేస్తున్న దళితులు

 సుభాష్‌నగర్‌, అక్టోబరు 17: తమ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు మాట ఇచ్చి తప్పారని కలెక్టరేట్‌ ఎదుట హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దళితులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్నప్పటికి తమకు దళితబంధే ఇవ్వలేదన్నారు. ఈ విషయం గురించి ప్రజావాణిలో అనేకసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు.  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళామని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తరువాత తమను పట్టించుకోలేదని, ఇప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే తమ సమస్య పరిష్కరించాలని కోరారు.


Updated Date - 2022-10-18T04:54:51+05:30 IST