మరింత మంది యువతకు శిక్షణ అందించాలి

ABN , First Publish Date - 2022-11-19T00:24:54+05:30 IST

అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌ (ఐడీటీఆర్‌)లో మరింత ఎక్కువ మంది నిరోద్యగ యువతకు శిక్షణ అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులకు సూచించారు.

మరింత మంది యువతకు శిక్షణ అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

తంగళ్లపల్లి, నవంబరు 18: అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌ (ఐడీటీఆర్‌)లో మరింత ఎక్కువ మంది నిరోద్యగ యువతకు శిక్షణ అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులకు సూచించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఐడీటీఆర్‌ వార్షిక సాధారణ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో అంతర్జాతీయస్థాయి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఇందులో భాగంగా ఐడీటీర్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. ఐడీటీఆర్‌ తెలంగాణకే మణిహారమని, అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌లో శిక్షణతో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. సమావేశంలో ఐడీటీఆర్‌ సొసైటీ సెక్రెటరీ నుజుం రియాజ్‌, కోశాధికారి అనురాగ్‌ కనున్లో, మెంబర్‌ లీగల్‌ ఆశిస్‌ మిశ్రా, సభ్యులు అమిత్‌ జైన్‌, మినా ఆర్‌ఎస్‌, సి.రమేశ్‌, సీతారాములు, జే.గణేశ్‌, రాజు సంగ్వి, బెన్నూరు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:24:54+05:30 IST

Read more