తొమ్మిదేళ్ల పాలనలో ఎమ్మెల్యేది అంతా అవినీతే

ABN , First Publish Date - 2022-10-04T06:41:49+05:30 IST

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాలనలో అంతా అవినీతే చోటు చేసుకుంద ని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు.

తొమ్మిదేళ్ల పాలనలో ఎమ్మెల్యేది అంతా అవినీతే
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

-మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 3: ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాలనలో అంతా అవినీతే చోటు చేసుకుంద ని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు. స్థానిక సిరి ఫంక్షన్‌హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మానేరులో  ఇసుక,  చెరువుల్లో మట్టి, గుట్టల్లో మొరం అక్రమంగా అమ్ముకోవ చ్చని ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారాలతో అర్ధం అవుతుం దన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల నుంచి 25 వేల టాక్స్‌ కట్టాలని లేదంటే విజిలెన్స్‌ అధికారులతో  సీజ్‌ చేయి స్తున్నారని ఆరోపించారు. గతంలో 600 రూపాయలకు దొరికిన ట్రిప్పు ఇసుక ఇప్పుడు రెండు వేలు దాటిందన్నారు. కరీంనగర్‌లో బొమ్మకల్‌ శివారులో ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే అధికారులు విచారణ చేపట్టి స్వాధీనం చేసుకొని హద్దులు వేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వ్యసాయ శాఖ కార్యాలయం రేకులు ఎత్తుకెళ్లి మళ్లీ తీసుకువచ్చింది నిజం కాదా ప్రశ్నించారు. ఇసుక రీచ్‌ ల అవినీతిపై మల్లన్న ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరితే పోలీసులతో అడ్డుకు న్నాడని ఆయన పేర్కొన్నారు. ఇసుక జార వేసే ట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బం దులు కలిగించమని ఓవర్‌లోడ్‌ లారీలను అడ్డుకుంటామన్నారు. ఎమ్మెల్యే చేసిన అవినీతిపై చెప్పాలంటే సమయం సరిపోదన్నారు. ఎమ్మెల్యే వైఖరి నియోజకవర్గ ప్రజలకు తెలుస న్నారు. ఎమ్మెల్యే అవినీతి భరతం పట్టే వరకు ఊరుకోనని విజయరమణారావు హెచ్చరించారు. నాయకులు సారయ్య గౌడ్‌, మినుపాల ప్రకాష్‌రావు, భూషన వేన సురేష్‌గౌడ్‌, అంతటి అన్నయ్యగౌ డ్‌, దన్నాఆయక్‌, దామోదర్‌రావు, సయ్యద్‌ మస్రత్‌, సాయి రి మహేందర్‌, భూతగడ్డ సంపత్‌, మసూద్‌ పాల్గొన్నారు.

Read more