కాంగ్రెస్‌ శ్రేణులను బానిసలుగా చూస్తున్న ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-09-11T05:28:05+05:30 IST

మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బానిసలుగా చూస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు.

కాంగ్రెస్‌ శ్రేణులను బానిసలుగా చూస్తున్న ఎమ్మెల్యే
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

మంథని, సెప్టెంబరు 10: మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బానిసలుగా చూస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధు మాట్లాడుతూ.. మంథ ని నియోజకవర్గంలో 40 ఏళ్ళుగా కాంగ్రెస్‌ నుంచి తండ్రీకొడులు శ్రీపాదరావు, శ్రీధర్‌బాబులే ఉన్నత పదవులు అనుభవించారన్నారు. పార్టీ కోసం, వారి కుటుంబ కోసం కష్టపడ్డ ఏ ఒక్క బడుగు, బల హీన వర్గాల నేతలకు పదవులు కట్టబెట్టలేకపోవడం వారి నియంత పాలనకు నిదర్శమన్నారు. గ్రామాలు, మండలాల నాయకుల మధ్య పోటీ తత్వాన్ని పెంచి స్వార్థ రాజకీయాల కోసం వారిని పదవులకు దూరం పెడుతూ వచ్చారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బానిస పరిస్థితిని గమనించి పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. తనపై ఎన్ని అభాండాలు, అసత్య ప్రచారాలు చేసినా ఒక్కటి కూడా కాంగ్రెస్‌ వాళ్ళు రుజువు చేయలేకపోయారన్నారు. మంథని ఎమ్మె ల్యేగా, జడ్పీ చైర్మన్‌గా అవకాశాలు అందిపుచ్చుకొని బడుగు, బల హీన వర్గాలకు సేవ చేయడంతోపాటు తనను నమ్ముకున్న ఎంతో మందికి పదవులు ఇవ్వడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. తనను నిత్యం విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు, బహుజనులు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల నేతలందరికి పదవులు, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలన్నదే తన లక్ష్యమన్నారు. సమావేశంలో భూపాల పల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి-రాకేష్‌, ఎంపీపీ కొండ శంకర్‌, బన్సోడ రాణిబాయి, ముత్తయ్య, లక్ష్మి, జడ్పీటీసీలు తగరం సుమ లత, చెలుకల స్వర్ణలత, శారద, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త శ్రీని వాస్‌, చల్లనారాయణరెడ్డి, బయ్యపు మనోహర్‌రెడ్డి, గుజ్జుల రాజిరెడ్డి, చెప్యాల రామారావు, ఆరెపల్లి కుమార్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, పూదరి సత్యనారాయణగౌడ్‌, ఇనుగంటి భాస్కర్‌రావు, ఆకుల కిరణ్‌, పోతిరెడ్డి కిషన్‌రెడ్డి, పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, చెలుకల అశోక్‌, జవ్వాజి తిరుపతి, పర్స బక్కయ్య, శ్రీనివాస్‌రావు, రవీందర్‌ లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-11T05:28:05+05:30 IST