చైర్‌ పర్సన్‌, కమిషనర్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

ABN , First Publish Date - 2022-10-05T06:04:02+05:30 IST

సిరిసిల్ల మున్సిపల్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి రీసోర్స్‌ కేంద్రంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు.

చైర్‌ పర్సన్‌, కమిషనర్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు
అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి రీసోర్స్‌ కేంద్రంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు. స్వచ్ఛతలో మరింత ముందడుగు వేయాలని సూచించారు. ఇదే సందర్భంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌, వైస్‌ చైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ నాయకుడు చీటి నర్సింగరావు అభినందనలు తెలిపారు.  సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పాపారావు తదితరులు ఉన్నారు. 


Read more