-
-
Home » Telangana » Karimnagar » Married Woman Life in Hanmakonda District Leads to these Sad Ending ssr-MRGS-Telangana
-
Karimnagar Married Woman: భర్త ఫొటోగ్రాఫర్.. పాపం ఈ వివాహిత ఇలా చేయకుండా ఉండాల్సింది..!
ABN , First Publish Date - 2022-09-09T00:47:11+05:30 IST
ఆర్థిక సమస్యలు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కోగిల్వాయి గ్రామంలో..

దామెర (కరీంనగర్ జిల్లా): ఆర్థిక సమస్యలు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కోగిల్వాయి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ఎ.హరిప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుగు మాధవి(29) భర్త అనిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఫొటో స్టూడియో సరిగా నడవకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో మాధవి తన భర్త అనిల్‌తో ఆర్థికసమస్యల విషయమై గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మాధవి మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మాధవి తండ్రి తొట్ల మల్లయ్య ఫిర్యాదు వేరకు బుధవారం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.