ఎన్నో ఆశలు..ఎన్నెన్నో ఆకాంక్షలు

ABN , First Publish Date - 2022-12-31T23:35:59+05:30 IST

కాలగమనంలోకి కొత్త సంవత్సరం వచ్చే సింది. 2022కి ముగింపు పలికి 2023 సంవత్సరంలోకి ఎన్నో ఆశలు, ఆంకాంక్షలతో అడుగుపెట్టేశాం.

ఎన్నో ఆశలు..ఎన్నెన్నో ఆకాంక్షలు

- కొత్త కలలతో లక్ష్యాల సాధనకు అడుగులేసే తరుణమిదే..

జగిత్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కాలగమనంలోకి కొత్త సంవత్సరం వచ్చే సింది. 2022కి ముగింపు పలికి 2023 సంవత్సరంలోకి ఎన్నో ఆశలు, ఆంకాంక్షలతో అడుగుపెట్టేశాం. నూతన సంవత్సరంలో కొంగొత్త కలలతో అనుకున్న లక్ష్యాల సాధనకు అడుగుల ప్రస్థానం ప్రారంభించాం. గత యేడాది అధిక వర్షాలు, కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా ఆరోగ్యపరంగా చేదు జ్ఞాపకాలను ఎదుర్కొన్న జిల్లా ప్రజలు ఈ యేడాదైనా తీపి గుర్తులే మిగిల్చాలని, ప్రతీ కుటుంబానికి ఆనందం పంచాలని ఆకాం క్షిస్తున్నారు. కొందరికి ఆనం దాన్ని, మరికొందరికి విషాదాన్ని మిగిల్చిన 2022 సంవ త్సరానికి గుడ్‌ బై చెబుతూ..2023 సంవత్సరానికి జిల్లా ప్రజలు స్వాగతం పలుకుతు న్నారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు గడిచిన ఏడాది అనుభవాలు, కొత్త ఏడాది భవిష్యత్‌ ప్రణాళిక తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే....

సీఎం నేతృత్వంలో మరింత పురోగతి సాధిద్దాం

- కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగ మించాలి. తెలంగాణ వాసులతో పాటు దేశ, విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరూ శుభం కలగాలి. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించాలి.

ఆరోగ్య జిల్లాగా మార్చుదాం

డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

జగిత్యాల సెగ్మెంట్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను వచ్చే కొత్తయేడాదిలో అందించాలని ఆశిస్తున్నాం. జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దాం. సీఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లాకు మంజూరు చేసి ప్రారంభించిన మెడికల్‌ కళాశాల, అనుబంధ ఆసుపత్రి తదితర వాటి ద్వారా విస్తృతంగా వైద్య సేవలు అందిద్దాము.

ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి

- కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, ఎమ్మెల్యే, కోరుట్ల

జిల్లాలో ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలి. సకాలంలో వర్షాలు కురవాలి. పాడి పంటలు అభివృద్ధి చెందాలి. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటు అయిన బీఆర్‌ఎస్‌ ద్వారా దేశ ప్రజలందరికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందాలి.

సీఎం కేసీఆర్‌ ఆశలు, ఆశయాలు నెరవేరేలా కృషి

ఎల్‌ రమణ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, జగిత్యాల

సీఎం కేసీఆర్‌ ఆశలు, ఆశయాలు జిల్లాలో సంపూర్ణంగా నెరవేరేలా అవసరమైన కృషిని చేస్తా. జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేలా నా వంతు సహకారాలను ప్రభుత్వానికి అందిస్తాను. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారు.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

గుగులోతు రవి నాయక్‌, కలెక్టర్‌

ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. వర్షాలు కు రిసి పంటలు పండి ప్రజలు సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్ని వర్గాల సహకారాలతో జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి కృషి.

నేర రహిత సమాజం ఏర్పాటు కావాలి

- సింధూ శర్మ, ఎస్పీ

నూతన సంత్సరంలో నేర రహిత సమాజ నిర్మాణం ఏర్పాటు కావాలి. నేరాల నియం త్రణలో పౌరుల భాగస్వామ్యం మరింత అవసరం. ప్రతీ ఒక్కరు శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించడం సా మాజిక బాధ్యతగా స్వీకరించాలి. కొత్త ఏడాదిలో ప్రజలందరికి మంచి జరగాలి.

బీఆర్‌ఎస్‌తో దేశ వ్యాప్త సేవలు

దావ వసంత, జడ్పీ చైర్‌పర్సన్‌

కొత్త ఏడాదిలో అందరికి సుఖశాంతులు విరియాలని కోరుకుంటున్నా. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌గా రూపాంతరం పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిం చాలి. జిల్లా ప్రజలు, అన్ని వర్గాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు ఇలా ప్రతీ ఒక్క రూ అభి వృద్ధి, సంక్షేమంలో భాగస్వామ్యులు కావాలి.

Updated Date - 2022-12-31T23:36:22+05:30 IST