మామిడి తోటలే పేకాట కేంద్రాలు

ABN , First Publish Date - 2022-04-05T06:39:49+05:30 IST

జిల్లాలో మామిడి తోటలే పేకాట కేంద్రాలుగా మారుతున్నాయనడానికి పై రెండు సంఘటనలు ఉదాహ రణలు అవుతున్నాయి.

మామిడి తోటలే పేకాట కేంద్రాలు
మల్యాలలో పట్టుబడ్డ పేకాట రాయుళ్లు

ఫ జిల్లాలో విచ్చలవిడిగా మూడుముక్కులాట

ఫ రోడ్డున పడుతున్న కుటుంబాలు

ఫ గత నెల 28వ తేదిన జిల్లాలోని కోరుట్ల మండలం గుం లాపూర్‌ శివారులో గల మామిడి తోటలో ఇటీవల పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేశారు. సంఘటనలో 18 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రూ. 1.93 లక్షలు, 15 మొబైల్‌ ఫోన్‌లు, 9 ద్విచక్ర వాహనాలు స్వా ధీనం చేసుకున్నారు.

ఫ ఈనెల 1వ తేదీన మల్యాల మండలం సర్వాపూర్‌ గ్రామ శివా రులో మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఆరు గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 9,050 నగదు స్వాధీనం చేసు కున్నారు.

జగిత్యాల, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మామిడి తోటలే పేకాట కేంద్రాలుగా మారుతున్నాయనడానికి పై రెండు సంఘటనలు ఉదాహ రణలు అవుతున్నాయి. కొంత కాలంగా జిల్లాలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మామిడి తోటలు, వ్యవసాయ భూములు, పల్లెల శివారుల్లోని నిర్జీవ ప్రాంతాలు పేకాటకు అడ్డాగా మారుతు న్నాయి. కొందరు వేడుకల పేరుతో మద్యం, హుక్కా, గంజాయి మత్తు లో తూలుతున్నారు. అదే సమయం లో మూడు ముక్కలాట ఆడుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ వంటి పట్టణాలు, మండల కేంద్రాలకు చేరువలో ఉన్న శివారు ప్రాం తాల్లో పదుల సంఖ్యలో ఇటువంటి పేకాట అడ్డాలున్నాయి. 

గుంపుగా మారి ఆట....

జనవాసాలకు దూరంగా ఉండే మామిడి తోటలు, పంట పొలాలు, చెరువు గట్టులు, గోదావరి తీర ప్రాంతాలను వేదికగా చేసుకొని జూదా న్ని కొనసాగిస్తున్నారు. పేకాట కోసం ప్రత్యేక టెంటు, కుర్చీలు, టేబుళ్లు సైతం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. పేకాట రాయుళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను సైతం అందిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక వ్యక్తులను నియమించుకుంటున్నారు. పేకాట రాయుళ్లకు భోజనం, మం దును కూడా అందిస్తున్నారు. నిర్వాహకులు స్థావరం ఏర్పాటు చేసిన ప్రాంత సమాచారాన్ని పేకాట రాయుళ్లకు రహస్యంగా అందిస్తున్నారు.  ఎవరూ గుర్తించకుండా అడ్డాలు మారుస్తూ పేకాటను నిర్వహిస్తున్నారు. పేకాట స్థావరాల వద్దకు ఇతరులు ఎవరైనా వస్తే మందస్తుగా సమాచా రం ఇవ్వడానికి సెంట్రీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం స్థానిక నేతలకు తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదు. వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం లేదు. 

రమ్మీ, మూడు ముక్కలాటలు...

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట శిబిరాల్లో ఎక్కువగా రమ్మీ, మూడు ముక్కలాటలు నిర్వహిస్తు న్నారు. తొమ్మిది మందితో కెనెస్టా ఆటను ఆడిస్తున్నారు. రూ. 1,000 మొ దలుకొని రూ. 20,000 వరకు ఆటలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకుడు ఆటకు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు కమీషన్‌ తీసుకుంటు న్నారు. తాము తీసుకుంటున్న కమీషన్‌ నుంచి సంబంధిత అధికారులకు వారం, పక్షం, నెలవారీగా మాముళ్లు అందిస్తుంటారని సమాచారం.  

అనుమతులు లేకుండా...

జిల్లాలోని పట్టణాలకు చేరువలో ఉన్న పేకాటా కేంద్రాల్లో మద్యం సైతం ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు. ఫాం హౌజ్‌లు, ప్రైవేటు ప్రాం తాల్లో మద్యం వినియోగిస్తే ఎక్సయిజ్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా మద్యం వినియోగం కొనసాగుతోంది. దీనికి తోడు హుక్కా, గంజాయిని సైతం పలు సంద ర్భాల్లో వినియోగిస్తున్నారు.  

పట్టణాల్లో అద్దె గదుల్లోనూ...

జిల్లాలోని పలు ప్రదాన పట్టణాల్లో అద్దె గదుల్లోనూ పేకాటను నిర్వ హిస్తున్నారు. పేకాట నిర్వహణకు గదులు అద్దెకు తీసుకుంటున్నారు. ప ట్టణాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఆడుతుంటారు. కందరు జూదరులు స్నేహితుల ఇళ్లలో పేకాట ఆడుతున్నారు. పొరుగు జిల్లాలైన నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చి సైతం పేకాట ఆడుతున్నారు. పట్టుబడి అరెస్టు అయినప్ప టికీ వ్యసనం వదలకుండా మళ్లీ పేకాట ఆడుతున్నారు. 

నిరంతరం దాడులు నిర్వహిస్తాం

సింధూశర్మ, ఎస్పీ

పేకాట ఆడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దు. జూదం ఆడి డ బ్బులు సంపాదించవచ్చనే అత్యాశ ఉండకూడదు. దీనివల్ల ఎక్కువ శాతం నష్టమే జరుగుతుంది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటా ము. జిల్లాలో పోలీసులు నిరంతరం దాడులు నిర్వహిస్తారు.

Read more