మహాగౌరీ అలంకారంలో అమ్మవారి దర్శనం

ABN , First Publish Date - 2022-10-04T06:24:47+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సోమవారం మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహాగౌరీ అలంకారంలో అమ్మవారి దర్శనం
వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో మహాగౌరీ అలంకారంలో అమ్మవారు

వేములవాడ, అక్టోబరు 3: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సోమవారం మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో   ఎనిమిదవ రోజు ఉదయం అమ్మవారికి వివిధ పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు శ్రీమహిషాసుర మర్ధిని అమ్మవారికి అర్చకులు మహాపూజ నిర్వహించారు. 

Read more