జాతర సక్సెస్‌కు సమష్టిగా కృషి చేద్దాం

ABN , First Publish Date - 2022-12-31T00:16:33+05:30 IST

: వేము లవాలో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ప్లానింగ్‌ పకడ్బందీగా ఉంటేనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సులభం అవుతుందని, సమష్టి కృషితో జాతరను సక్సెస్‌ చేద్దామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

జాతర సక్సెస్‌కు సమష్టిగా కృషి చేద్దాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

వేములవాడ టౌన్‌, డిసెంబరు 30 : వేము లవాలో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ప్లానింగ్‌ పకడ్బందీగా ఉంటేనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సులభం అవుతుందని, సమష్టి కృషితో జాతరను సక్సెస్‌ చేద్దామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పా ట్లపై శుక్రవారం ఆలయ ఓపెన్‌స్లాబ్‌లో వివిధ శాఖల అధికారులతో జాతర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు గతం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని, గతం కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతీ శాఖ జాతర సమయంలో క్షేత్రస్థాయిలో అమలు చేసే కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని, వచ్చే సమావే శంలో వివరించాలని అన్నారు. ఆయా శాఖల అధికా రులు సిద్ధం చేసిన ప్రణాళికను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు అందజేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బస్సులు నడపాలన్నారు. హెల్ప్‌ డెస్కులు, శుద్ధజల కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమున్న చోట రోడ్ల మరమ్మతు చేపట్టాలన్నారు. ప్రతీ చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. దేవాల యంతోపాటు పట్టణ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. ఆయా శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం శివరాత్రి జాతర ప్రాథమిక సమాచారం ప్రత్యేక ఆప్‌, డైరెక్టరీని రూపొందించనున్నట్లు తెలిపారు.

జాతరకు పటిష్ఠ భద్రత

మహాశివరాత్రి జాతరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతం కంటే ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా మని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్‌లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఈవో కృష్ణప్రసాద్‌, ఆర్డీవో పవన్‌కుమార్‌, డీఎస్పీ నాం గేంద్రచారి, జిల్లా రవాణా అధికారి కొండల్‌ రావు, డీపీవో రవీందర్‌, ఫ్యాకేజీ-9 కార్యనిర్వా హక ఇంజనీరు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ ఉన్నారు.

రాజన్నను దర్శించుకున్న కలెక్టర్‌

వేములవాడ రాజారజేశ్వరస్వామిని కలెక్టర్‌ అను రాగ్‌ జయంతి, అదనపు కలెక్టరులు ఖీమ్యానాయక్‌, సత్యప్రసాద్‌ శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజ అనంతరం ఆలయ మండపంలో వారిని అర్చకులు ఆశీర్వదించారు. అధికారులు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.

Updated Date - 2022-12-31T00:16:33+05:30 IST

Read more