గరుడవాహనంపై దర్శనమిచ్చిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి

ABN , First Publish Date - 2022-10-07T05:43:27+05:30 IST

పట్టణంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

గరుడవాహనంపై దర్శనమిచ్చిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి
గరుడవాహనంపై ఊరేగుతున్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి

- దర్శించుకున్న భక్తులు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, అక్టోబరు 6: పట్టణంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం హోమం నిర్వహించిన అనంతరం స్వామివారిని గరుడవాహనంపై వీధులగుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో సాయంత్రం హోమం నిర్వహించిన అనంతరం శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారిని హనుమంత వాహనంపై  పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం ఆలయంలో సుందరకాండ పారాయణం, విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, భగవద్గీత పారాయణం, శ్రీ సుదర్శన శతకపారాయణము, లలితసహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించా రు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఉప్పుల విఠల్‌రెడ్డి, ధర్మకర్తలు మేర్గు లక్ష్మణ్‌, మామిడాల రమణ, కత్తెర సంతోషిణి, కోడం శ్రీనివాస్‌, అల్లాడి సరస్వతి, ఎక్స్‌అఫీషియో మెంబర్‌ సీహెచ్‌ రాంమోహనాచారి,  కార్యనిర్వహ ణాధికారి డివి మారుతిరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Read more