కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాల సాధన కోసం కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-09-22T04:47:05+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశాయాల సాధన కోసం కృషి చేయాలని ఆదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాల సాధన కోసం కృషి చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న గద్దర్‌


సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 21: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశాయాల సాధన కోసం కృషి చేయాలని ఆదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తన 25వ ఏటనే న్యాయవాద విద్యను పూర్తి చేసి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. 1952లో నిర్వహించిన తొలి శాసనసభ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 87 వయస్సులో ఉన్నా ఆయన చురుకుగా పాల్గొన్నారని అన్నారు. పద్మశాలి సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి వొల్లాల కృష్ణహరి, కోశాధికారి అలుస భద్రయ్య, గ్రంధాలయ చైర్మెన్‌ పొన్నం అనిల్‌గౌడ్‌, కార్పొరేటర్లు ఐలేందర్‌యాదవ్‌, లెంకల స్వప్న వేణుగోపాల్‌, చొప్పరి జయశ్రీ, బోనాల శ్రీకాంత్‌, పద్మశాలి సంఘం నాయకులు గడ్డం శ్రీరాములు, మార్త ప్రకాశ్‌, వొడ్నాల రవీందర్‌, దూడం శ్రీనివాస్‌, స్వర్గం నరసయ్య, గడ్డం వెంకటేశం, రవీందర్‌, రుద్ర రాధ, యెన్నం మునీందర్‌ పాల్గొన్నారు.


Read more