-
-
Home » Telangana » Karimnagar » Konda Laxman Bapuji should continue his ambitions-MRGS-Telangana
-
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి
ABN , First Publish Date - 2022-09-28T05:02:35+05:30 IST
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 27 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మ ణ్ బాపూజీ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, పెద్ద పల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి అనంతరం వారి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. తె లంగాణ కోసం మంత్రి పదవిని సైతం 1969ఉద్యమ సమయంలో రాజీ నామా చేసిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ అని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర చేనేత సహకా ర సంఘం కనుకులకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డు గ్రహీతలను మిట్టపెల్లి లక్ష్మయ్య ఆడెపు రాజేశం ముఖ్యఅతిథులను సన్మా నించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు గంట రాములు, జడ్పీటీసీ లక్ష్మణ్, జడ్పీటీసీ బండారి రాంమ్మూర్తి, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి, పద్మ శాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రాంమ్మూర్తి, మత్య్సశాఖ మాజీ చైర్మన్ చేతి ధర్మయ్య, ప్రజాప్రతినిధులు, వెనుకబడిన తరగతుల అభివృ ద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, డీసీవో మై ఖేల్‌బోస్, వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శంకర్, పద్మశాలి, బీసీ సంఽఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.