రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసిన ఘనుడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-12-31T23:30:59+05:30 IST

ఉద్యమాలతో సాధించుకన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్న ఘనుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసిన ఘనుడు కేసీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 31 :ఉద్యమాలతో సాధించుకన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్న ఘనుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. 58 ఏళ్ల సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అప్పుల వాటా కేవలం రూ. 60 వేల కోట్లు మాత్రమేనని రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌ ఉండగా ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఈ తొమ్మిదేళ్లలో ఐదు లక్షల కోట్లకు చేర్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. అధికారి కంగా 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్మీలో లేని ఆంక్షలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో పెట్టడంతో అభ్యర్ధులు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృ ష్టి సారించి గతంలో ఉన్న నిబంధలను అమలయ్యేలా చూడాలన్నారు. పోలీస్‌ రిక్రూ ట్‌మెంట్‌లో యువకులు ఎదురుకుంటున్న సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకవె ళ్లేందుకు ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను రాత్రికి రాత్రే ముందస్తు అరెస్టులు చేసి ఠాణాలకు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, ప్లోర్‌ లీడర్‌ కల్లెపెల్లి దుర్గయ్య, యూత్‌ అధ్యక్షుడు మధు, మాజీ పీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, నాయకులు గాజుల రాజేందర్‌, చంద రాదాకిషన్‌ రావు, జున్ను రాజేందర్‌, నేహాల్‌, చాంద్‌ పాష, మహిపాల్‌, జీవన్‌, సురేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:31:28+05:30 IST