ముగిసిన కాళేశ్వరం జోన్‌స్థాయి గురుకుల క్రీడలు

ABN , First Publish Date - 2022-09-28T05:03:44+05:30 IST

స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అవరణలో మూడు రోజుల పాటు నిర్వహించిన కాళేశ్వరం జోన్‌స్థాయి క్రీడోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.

ముగిసిన కాళేశ్వరం జోన్‌స్థాయి గురుకుల క్రీడలు
విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఎంపీపీ, జడ్పీటీసీ

మంథని, సెప్టెంబర్‌ 27: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అవరణలో మూడు రోజుల పాటు నిర్వహించిన కాళేశ్వరం జోన్‌స్థాయి క్రీడోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. వివిధ క్రీడా విభాగాల్లో 21 అంశాల్లో జోన్‌ పరి ధిలోని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. 5 జిల్లాల్లోని 11 గురకులాల నుంచి 132 జట్లు క్రీడల్లో పాల్గొన్నాయి. కబడ్డీలో అండర్‌-14లో జైపూర్‌, అండర్‌-17, 19లో మంథని, ఖోఖోలో అండర్‌-14 జాకారం, అండర్‌-17, 19లో మంథని, చెస్‌లో అండర్‌-14, 19లో ఆసిఫాబాద్‌, అండర్‌-17లో మంథని, క్యారమ్‌లో అండర్‌-14లో పెద్దపల్లి, 17లో ఆసీఫాబాద్‌, 19లో జాకారం, టెన్నికైట్‌లో అండర్‌-14, 17, 19లో మంథని, ఫుట్‌బాల్‌లో అండర్‌-17, 19 జైపూర్‌, హ్యాండ్‌బాల్‌లో అండర్‌-17 జైపూర్‌, 14లో మంథని, బాల్‌బ్యాడ్మింటన్‌లో అండర్‌-1లో జాకారం, 19లో ఏటూరునాగారం, వాలీబాల్‌లో అండర్‌-17 బెల్లంపల్లి, 19లో ఏటూరునాగారం విజేతలుగా నిలిచారు. విజేతలకు మంథని ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత-శంకర్‌ లాల్‌, తహశీల్దార్‌ బండి ప్రకాష్‌, ఎంపీడీవో రమేష్‌, పాఠశాల ప్రన్సిపాల్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఏఆర్సీవో సూర్యప్రకాష్‌ బహుమతులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పీఈటీ లు, ఉపాధ్యాయు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more