జగిత్యాల వైద్య విద్య తరగతులు షురూ

ABN , First Publish Date - 2022-11-15T01:03:00+05:30 IST

జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవే రింది. అన్ని హంగులతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమైం ది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల ప్రభు త్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు.

జగిత్యాల వైద్య విద్య తరగతులు షురూ
ముస్తాబయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనం

జగిత్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవే రింది. అన్ని హంగులతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమైం ది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల ప్రభు త్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో సర్వాంగ సుందరంగా తాత్కాలిక భవనాల్లో మెడికల్‌ కళాశాల తరగతు లను ప్రారంభించడానికి సిద్ధం చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ నీట్‌ కౌన్సిలింగ్‌ ద్వారా 150 సీట్లలో విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈనెల 15వ తేదీ నుంచి వైద్య విద్య తరగతులను బోధిం చనున్నారు. ఇందుకు అవసరమైన వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది నియా మకం చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్‌లో వర్ఛు వల్‌ పద్ధతి ద్వారా సీఎం కేసీఆర్‌ జగిత్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.

సకల సౌకర్యాలతో మెడికల్‌ కళాశాల ఏర్పాటు

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌ :సకల సౌకర్యాలతో జగిత్యాలలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రానికి మం జూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను మంగళవారం వర్ఛువల్‌ పద్ధతి ద్వారా సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న దృష్ట్యా సోమవారం కళాశాలను ఎమ్మెల్యే సం దర్శించారు. ల్యాబ్‌, హాస్టల్‌, తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. రూ. 140 కోట్లతో పక్కా మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తయ్యాయని త్వరలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు. అంతేకాకుంగా కళాశాల చూట్టూ నాలుగు వైపులా రహదారుల నిర్మాణం కోసం రూ. 11 కోట్లు మంజూరయ్యాయన్నారు. జగిత్యాలలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు కు కృషి చేసిన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీష్‌ రావులకు ప్రత్యేక ధన్యవాదా లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శివరాం ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపా ల్‌ డేవిడ్‌ ఆనంద్‌, కౌన్సిలర్లు జుంబర్తి రాజ్‌ కుమార్‌, కూసరి అనీల్‌, నాయకులు దుమాల రాజ్‌ కుమార్‌, సుధాకర్‌, ఆరీఫ్‌. పవన్‌, కృష్టారావు, అంజయ్య ఉన్నారు.

Updated Date - 2022-11-15T01:03:03+05:30 IST