తెలుగు రాష్ట్రాలు కలవాలనడం బీజేపీ కుట్ర

ABN , First Publish Date - 2022-12-10T00:31:11+05:30 IST

ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సరైన పద్ధతి కాదని, దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ జీవ న్‌ రెడ్డి ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాలు కలవాలనడం బీజేపీ కుట్ర
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 9 : ఏపీ, తెలంగాణను మళ్లీ కలుపాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సరైన పద్ధతి కాదని, దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ జీవ న్‌ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇంధిరా భవన్‌లో శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రె స్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీవన్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధిం చుకోవడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. మోదీ, జగన్‌ల మధ్య తండ్రీ, కొడుకుల అనుభంధం ఉందని అంటున్న ఆపార్టీ నాయకులు ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు కొట్లాడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రా ల్లో అధికారంలోకి వస్తామని ఽధీమా వ్యక్తం చేశారు. దశాబ్ధాల కలను స హకారం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన దేవత సోనియా గాంధీ అని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అ ధ్యక్షురాలు విజయ లక్ష్మి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధు, మై నార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మన్సూర్‌, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, నాయకులు రాజేందర్‌, నందయ్య, అంజన్న, శ్రీనివాస్‌, రియాజ్‌, చాంద్‌ పాష, రజనీ కాంత్‌, మహిపాల్‌, మహిళా నాయకులు సరిత, లత ఉన్నారు.

Updated Date - 2022-12-10T00:31:13+05:30 IST