స్వచ్ఛతలో..శభాష్‌

ABN , First Publish Date - 2022-09-24T05:51:50+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ పో టీల్లో జాతీయ స్థాయిలో జగిత్యాల అగ్రభాగాన నిలిచింది.

స్వచ్ఛతలో..శభాష్‌

- దేశంలోనే టాప్‌-2గా జగిత్యాల

- గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో అరుదైన ఘనత

- వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరణ

జగిత్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ పో టీల్లో జాతీయ స్థాయిలో జగిత్యాల అగ్రభాగాన నిలిచింది. భారతదేశం లో జరిగిన అతిపెద్ద పారిశుధ్య సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ-2021 కా ర్యక్రమంలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ-2021 పోటీలను నిర్వహించారు. మొబైల్‌ ఆప్‌ ద్వారా ప్రజాభిప్రా య సేకరణ జరిపి ర్యాంకింగ్‌లు నిర్ణయించారు. జిల్లాను దేశంలోనే అగ్ర భాగాన నిలుపుదాం అని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఇచ్చిన పిలు పుమేరకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతిని ధు లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పచ్చదనం, పరిశుభ్రతను పాటిం చారు. మొబైల్‌ యాప్‌ ద్వారా తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించారు. దీంతో జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లా రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

జిల్లా గ్రామీణ సమాచారం ఇలా..

జగిత్యాల జిల్లాలో కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల డివిజన్లున్నాయి. జిల్లా లో 18 మండలాల్లో 380 గ్రామ పంచాయతీలు, 495 గ్రామాలున్నాయి. ముగ్గురు డీఐపీవోలు, 18 మంది ఎంపీవోలు, 380 గ్రామ పంచాయతీ సె క్రటరీలు పనిచేస్తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,95,965 గృహా లుండగా సుమారు 7,25,702 గ్రామీణ జనాభా ఉంది.

అవార్డు దక్కిందిలా..

దేశంలోనే స్వచ్ఛతలో అత్యుత్తమ ప్రతిభ నాణ్యతతో కూడిన పనితీరు కనబరిచినందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ మిషన్‌ 2021లో జిల్లా అరుదైన గుర్తిం పును సాధించింది. 2021 సెప్టెంబరులో సర్వే ప్రారంభించి డిసెంబర్‌ 2021 వరకు జరిపిన క్షేత్ర స్థాయి తనిఖీల్లో జగిత్యాల జిల్లాలోని గ్రామా లలో భౌతిక పరిశీలన చేశారు. 2021 డిసెంబరులో క్షేత్ర స్థాయి పరిశీలన లో గుర్తించిన అంశాలను నమోదు చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన మండలాల్లో గల 26 గ్రామాలల్లో ప్రస్తుత యేడాది జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సంపూర్ణ వివరాలను సేకరించడంతో పాటు ఆన్‌ లైన్‌లో నమోదు చేసి కేంద్రానికి అందించారు. ఇందుకు గాను గ్రామాలలో పారిశుధ్య, గ్రామ పంచాయతీ, పాఠశాల, అంగన్‌ వాడీ కేంద్రం, పీహెచ్‌సీ, టాయిలెట్ల వినియోగం,చెత్త నిర్వహణ, మురికి నీటి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పౌరుల అభిప్రాయ సేకర ణ జరిపి తనిఖీ ఫలితాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 

గతంలోనూ ఇదే తీరు...

అదేవిదంగా 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా 15వ ర్యాంకును, 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో 11వ ర్యాంకును సొంతం చేసుకుంది. అప్పటి కలెక్టర్‌ శరత్‌ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును పొందారు. 2021 సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో 2వ ర్యాంకును పొంది జాతీయ స్థాయిలో గౌరవం నిలబెట్టుకుంది. వచ్చే నెల 2వ తేదిన ఢిల్లీలో నిర్వహించనున్న వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌, డీఆర్‌డీవో వినోద్‌లు  రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోకున్నారు.

తడి, పొడి చెత్త నిర్వహణ..

జిల్లాలో ఇంటింటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు వెళ్లి చె త్త సేకరణపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రా మ పంచాయతీ చెత్తబండికి అందించేలా ప్రోత్సహించారు. రోడ్లపైన ము రికి కాలువల్లో ఖాళీ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా అవగాహనకల్పిం చారు. దీంతో పరిశుభ్రత వెల్లివెరిసేలా జాగ్త్రతలు తీసుకున్నారు.

సామూహిక ప్రదేశాల్లో పారిశుధ్యం..

జిల్లాలోని పలు గ్రామాల్లో గల పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఆ రోగ్య కేంద్రాల్లో గ్రామ పంచాయతీ, దేవాలయాలు, మసీదులు, ప్రార్థన స్థ లాలు తదితర సామూహిక ప్రదేశాల్లో పారిశుధ్య వసతులను కల్పించా రు. మూత్రశాలలు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లను నిర్మించడం వం టివి జరిపారు.

బహిరంగ మల విసర్జన నిషేధం..

జిల్లాలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో బహిరంగ మల విసర్జన నిషే ధాన్ని పకడ్బందిగా పాటించారు. జిల్లాలోని ప్రతీ గ్రామం వంద శాతం వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణం జరిపి బహిరంగ మల విసర్జన రహితం గా తీర్చిదిద్దారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు వహించారు. నిర్మించిన మరుగుదొడ్లను వినియోగిం చేలా అవగాహన కల్పించారు. గతంలో స్వచ్ఛదర్పన్‌ కార్యక్రమంలో భా గంగా 24 గంటల్లో 380 మరుగుదొడ్లను నిర్మించి జిల్లా అధికారులు, ప్ర జాప్రతినిధులు ప్రశంసలు పొందారు.

పకడ్భందీగా మురికి నీటి నిర్వహణ...

పల్లెల్లో గల ఇండ్లలో నుంచి వెలువడే మురికి నీటిని ఇంకుడు గుం తకు మళ్లించేలా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు. ఇంటి పరిస రాలలో మురికి నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించారు. మురికి నీటి కాలువను నిర్మించడం, రహదారులపైకి మురుగు నీరు రాకుండా చూడడం వంటివాటిపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

సమష్టి కృషితోనే...

- గుగులోతు రవి నాయక్‌, జిల్లా కలెక్టర్‌

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్ష నేతలు, మహిళా, యువజన సంఘాల సభ్యులు ఇలా అన్ని వర్గాల ప్రజల సమిష్టి కృషితో జాతీయ అవార్డు దక్కింది. ప్రస్తుతం లభించిన అవార్డు స్పూర్తితో రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధిస్తాము.

సేవలకు తగ్గ గుర్తింపు లభించింది

- అరుణ శ్రీ, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

జిల్లాలో కొన్ని రోజులగా అన్ని వర్గాల వ్యక్తులు అందిస్తున్న సహకారా లు, సేవలకు తగ్గ గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో జగిత్యాల జి ల్లాకు రెండవ స్థానం లభించడం ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసి న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు నిజమైన గౌరవం దక్కిన ట్లయింది. ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు.

జాతీయ స్థాయి గౌరవం దక్కడం సంతోషం

డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

జగిత్యాల జిల్లాకు జాతీయ స్థాయి గౌరవం దక్కడం అభింనదనీయం. జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు చేసిన కృషికి నిదర్శనంగా నిలిచింది. ఈ స్పూర్తితో జిల్లాలో మున్ముందు  మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని సాదిస్తాము.


Read more