-
-
Home » Telangana » Karimnagar » Huzurabad student who left for home-NGTS-Telangana
-
స్వదేశానికి బయల్దేరిన హుజూరాబాద్ విద్యార్థి
ABN , First Publish Date - 2022-03-05T06:20:59+05:30 IST
హుజూరాబాద్ పట్టణానికి చెందిన కర్ర పాపిరెడ్డి-సరళల కుమారుడు కర్ర నిఖిల్‌రెడ్డి ఉక్రెయిన్ దేశ రాజధాని కివ్‌లో మెడిసిన్ పైనలియర్ చదువుతున్నాడు.

హుజూరాబాద్, మార్చి 4: హుజూరాబాద్ పట్టణానికి చెందిన కర్ర పాపిరెడ్డి-సరళల కుమారుడు కర్ర నిఖిల్‌రెడ్డి ఉక్రెయిన్ దేశ రాజధాని కివ్‌లో మెడిసిన్ పైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో వారం రోజుల నుంచి తమ కుమారుడి రాక గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం కర్ర నిఖిల్‌రెడ్డి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీలో దిగి హుజూరాబాద్‌కు వస్తున్నట్లు తెలియడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.