ఎస్టిమేట్‌ కాపీ లేకుండా పనులెలా చేస్తారు..?

ABN , First Publish Date - 2022-12-23T00:39:41+05:30 IST

ఎస్టిమేట్‌ కాపీ లేకుండా ‘మనఊరు మనబడి’ పనులను ఎలా చేస్తున్నారు..? అంచనా విలువ పత్రం అందుబాటులో లేకపోతే పనులను పరిశీలించి ఏం చేయాలంటూ జిల్లా అదనపు కలెక్టర్‌ మంకరంద అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎస్టిమేట్‌ కాపీ లేకుండా పనులెలా చేస్తారు..?
మొగిలిపేటలో అధికారులను ప్రశ్నిస్తున్న అదనపు కలెక్టర్‌ మంకరంద

మల్లాపూర్‌, డిసెంబరు 22 : ఎస్టిమేట్‌ కాపీ లేకుండా ‘మనఊరు మనబడి’ పనులను ఎలా చేస్తున్నారు..? అంచనా విలువ పత్రం అందుబాటులో లేకపోతే పనులను పరిశీలించి ఏం చేయాలంటూ జిల్లా అదనపు కలెక్టర్‌ మంకరంద అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మనఊరు మనబడి పనులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబందింత అధికారుల వద్ద పనులకు సంబంధించిన పత్రాలు లేకుండా పనులు ఏ విధంగా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తరగది గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున అదనంగా రెండు గదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేస్తున్న పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి బాగుందని పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఓబులాపూర్‌ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు. ఆయన వెంట సర్పంచు నాగరాజ్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో రాజశ్రీనివాస్‌, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - 2022-12-23T00:39:43+05:30 IST