అంబరాన్నంటిన హోలీ సంబరాలు

ABN , First Publish Date - 2022-03-19T05:49:04+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడు కలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువతీ, యువకులు రంగులు చ ల్లుకుంటూ నృత్యాలు చేశారు

అంబరాన్నంటిన హోలీ సంబరాలు
జగిత్యాలలో వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌

వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

జగిత్యాల టౌన్‌, మార్చి 18 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడు కలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువతీ, యువకులు రంగులు చ ల్లుకుంటూ నృత్యాలు చేశారు. కలెక్టర్‌ రవి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, స్థానిక సంస్థల అదనపు కలె క్టర్‌ అరుణశ్రీ, జగిత్యాల ఆర్డీవో దుర్గా మాధురిలతో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్లు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

ఫకలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో హోలీ వేడుకలను ఘనంగా జరు పుకున్నారు. ఉపాధ్యాయ సంఘం, టీఎన్‌జీవోలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల సభ్యులు వేడుకల్లో పాల్గొని కలెక్టర్‌ రవికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ పలువురికి రంగులు పూసి స్వీట్లు తినిపించారు. రెవెన్యూ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 

హోలీ పండుగ ఐక్యతకు చిహ్నం..

హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైఖ్యతాభావంతో దే శంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటని కలెక్టర్‌ రవి అన్నారు. హో లీ పండుగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు. 

జిల్లా ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలి : ఎమ్మెల్యే

జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎ మ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. నూకపెల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయం వద్ద హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌ కు మార్‌ జగిత్యాల నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల

జగిత్యాల : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం జ రిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌లోని శ్రీపురం కాలనీలో గల తన నివాసం వద్ద పలువురు చిన్నారులు, విద్యార్థులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు మంత్రికి రంగులు దిద్ది హోలీ శుభాకాం క్షలు తెలిపారు. కాలనీకి చెందిన పలువురు వ్యక్తులు పాల్గొన్నారు.

మల్యాల : మండలంలో యువతీ యువకులు, చిన్నారులు రంగులు పూసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకు లు, అధికారులు ఒకరికొకరూ హోలీ శుభాకాంక్షలు తెలు పుకున్నారు.

Updated Date - 2022-03-19T05:49:04+05:30 IST