మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
ABN , First Publish Date - 2022-10-17T05:53:36+05:30 IST
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది.
60 మంది వైద్యులచే సేవలు
శిబిరానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం పట్ట ణంలోని సర్ధార్ సత్రం (వైశ్యభవన్)లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వ హించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి వేర్వే రు సందర్బాల్లో శిబిరానికి హాజరయ్యారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ జగిత్యాల కు చెందిన సుమారు 60 మంది వైద్యులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు అందిం చారు. సుమారు 1200 మంది రోగులు వైద్య సేవలు పొందారు. బీపీ, షుగర్, ఈ సీజీ, టూడీఈకో వంటి పరీక్షలను వైద్య నిపుణులు చేశారు. రోగులకు సుమారు రూ. 4 లక్షల విలువ గల మందులను పంపిణీ చేశారు. పలువురు నిరుపేద మ హిళలకు ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో కుట్టు మిషన్లను ఉచితంగా అందిం చారు.
సేవా దృక్పతంతోనే ప్రజల్లో గుర్తింపు: ఎమ్మెల్యే
సేవా దృక్పతం అలవర్చుకోవడం ద్వారా ప్రజల్లో సరైగుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరా న్ని నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. సండే ఫర్ సర్వీస్ అనే నినాదంతో ప్రతి ఆదివారం తాను ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నానన్నారు.
మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం: ఎమ్మెల్సీ
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభి నందనీయమని ఎమ్మెల్సీ తాటపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. నిరుపేదలకు ప్రత్యేక వైద్య సేవలు అం దుబాటులోకి తేవడానికి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, పట్టణ ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షుడు ఎరవల్లి సురేశ్, అధ్యక్షులు మంచాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పబ్బ శ్రీనివాస్, కోశాధికారి జిడిగే పురుషోత్తం, చాంబర్ కామర్స్ ఆఫ్ అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, మున్సి పల్ కౌన్సిలర్లు గాజుల లలిత, కప్పల శ్రీకాంత్, బొడ్ల జగదీశ్, రైతు బంధు సమితి సభ్యులు దామోదర్ రావు, నాయకులు గాజుల రాజేందర్ పాల్గొన్నారు.