ఘనంగా మొహర్రం

ABN , First Publish Date - 2022-08-10T05:58:45+05:30 IST

నగరంలో మంగళవారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. పాతబజార్‌ జామా మసీదు వద్ద ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

ఘనంగా మొహర్రం
జామామసీద్‌ వద్ద దట్టీ కట్టించుకుంటున్న మంత్రి గంగుల

కరీంనగర్‌ కల్చరల్‌, ఆగస్టు 9: నగరంలో మంగళవారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. పాతబజార్‌ జామా మసీదు వద్ద ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పీరీలను ఊరేగించి జామా మసీదు పక్కన నిలుపగా ముస్లింలు, హిందువులు పిల్లా పాపలతో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు పీరీల దర్శనం కొనసాగింది.

త్యాగానికి ప్రతీక మొహర్రం 

-మంత్రి గంగుల కమలాకర్‌

త్యాగానికి ప్రతీక మొహర్రం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆయన పీరీలను దర్శించుకుని దట్టీ ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నానన్నారు. ఎంఐఎం పార్టీ జిల్లా ఇన్‌చార్జి గులాం అహ్మద్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో షర్బత్‌ పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు చల్ల హరిశంకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌షమీ, ఎంఐఎం నాయకులు సయ్యద్‌ బర్కత్‌అలీ, అజర్‌ దబీర్‌, ఖమరుద్దీన్‌ కాజమలీఖాన్‌, కోఆప్షన్‌ సభ్యుడు అంజద్‌అలీ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:58:45+05:30 IST