షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2022-11-24T23:58:28+05:30 IST

అమ్మకానికి రైతులు తీసుకువచ్చే వరి ధాన్యాన్ని ఎలాం టి షరతులు లేకుండా అధికారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సూచించారు.

షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

మంథని, నవంబర్‌ 24: అమ్మకానికి రైతులు తీసుకువచ్చే వరి ధాన్యాన్ని ఎలాం టి షరతులు లేకుండా అధికారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సూచించారు. స్థానిక మార్కెట్‌ యార్డులోని ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని గురువారం శ్రీధర్‌బాబు సందర్శించి కొనుగోళ్ళ తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధ నల ప్రకారం తూకం వేయాలన్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే రైతలకు రసీ దు ఇవ్వాలన్నారు. మిల్లర్లకు సంబంధం లేకుండా ధాన్యం రసీదు ఇవ్వాలన్నారు. తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోమన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నేత లు శశిభూషన్‌కాచే, సెగ్గెం రాజేష్‌, రావికంటి సతీష్‌, వెంకన్న, ప్రవీణ్‌, రాజన్న, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:58:28+05:30 IST

Read more