నష్టపరిహారం అందించడంతో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2022-09-26T05:48:48+05:30 IST

పంట నష్టపరిహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

నష్టపరిహారం అందించడంతో ప్రభుత్వాలు విఫలం
చింతల చెరువు పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌, సెప్టెంబరు 25: పంట నష్టపరిహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని చింతల చెరువుకు గండిపడ్డ ప్రాంతాన్ని స్థానిక రైతులతో కలిసి ఆది వారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలు, చెరు వుల, కుంటల తూముల మర్మతులకు తక్షణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకున్నా మని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పంట న ష్ట పోయిన రైతులకు పరిహారం అందించక పోవడం దురదృష్టకమన్నారు. కనీసం పంటల బీమా పథకం అమల్లో ఉన్నా పరిహారం పొందే అవకాశం ఉండేదని తెలి పారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు గండిపడి వందల ఎకరాల్లో పంటలు, విద్యుత్‌ మోటర్ల నష్టం జరిగినా ఇప్పటి వరకు అధికారులు అంచనాలు రూపొందించలేదని అధి కారు లపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్‌పూర్‌, ధర్మపురి మండలాల్లో 100కోట్ల ది గుబడి నష్టం జరిగిందన్నారు. గోదావరి తీరప్రాంతంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌లు పూర్తిగా వరదలతో దెబ్బతిన్నాయని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. సారంగాపూర్‌ చిం తల చెరువు తూము నిర్మాణానికి కట్ట వరకు వాల్‌ ఏర్పాటు చేయక పోవడం, నాణ్య త లోపంతో బుంగపడి నీరు వృధాగా పోతుందని వెంటనే చర్యలు చేపట్టాలని సం బంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రోళ్లవాగు, అరగుండాల ఆయకట్టు రైతు లకు నవంబరు చివరికల్లా నీరందించేల పూర్తి స్థాయి మరమ్మతులతో పాటు రెండవ పంటకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల జమున రాజిరెడ్డి, సీనియర్‌ నాయకులు కొక్కు గంగారాం, కాలగిరి సత్యనారాయణ రెడ్డి, కర్నె అంజిరెడ్డి, రైతులు కాలగిరి మధు పాల్గొన్నారు.


Read more