వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2022-10-02T06:04:30+05:30 IST

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

-కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ 

కరీంనగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటో రియంలో మహిళ, శిశు, వికలాం గులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారానికి ఒకరోజు వయోవృద్ధులకు వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వయోవృద్ధుల సంక్షే మ చట్టం ప్రకారం సంరక్షణకు, నిరాదరణకు గురైన వయోవృద్ధులు రెవెన్యూ డివిజనల్‌ అధికారికి సాధారణ దరఖాస్తు సమర్పిస్తే చాలని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే అప్పిలేట్‌ అధికారిగా ఉన్నతాధికారులకు దర ఖాస్తు సమర్పించాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను గిఫ్ట్‌ డీడ్‌ చేసినప్పుడు అందులో తప్పనిసరిగా షరతు లను పెట్టాలని తెలిపారు. భవిష్యత్‌లో పిల్లలు పట్టించుకోని పక్షంలో ఈ గిఫ్ట్‌ డీడ్‌ చెల్లదని ముందే దస్తావే జుల్లో పేర్కొనాలని సూచించారు.   అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన, అందిస్తున్న వయోవృద్ధులను  సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, గరిమ అగర్వాల్‌, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, జిల్లా శిశు సంక్షేమాధికారి సబిత, జిల్లా వైద్యాధికారి జువేరియా, డీఈవో జనార్ధన్‌రావు, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల బాధ్యులు సముద్రాల జనార్ధన్‌రావు, వడ్లూరి వెంకటేశం, సత్తయ్య, మోసం అంజయ్య పాల్గొన్నారు. 


Read more