మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-03-05T06:28:18+05:30 IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌, మార్చి 4: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మల్యాల, మీర్జంపేట, మొట్లపల్లి, పెద్దరాతుపల్లి, పెగడపల్లి, అంకంపల్లి గ్రామాల్లో రూ. 1.30కోట్ల ఈజీఎస్‌ నిధు లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మ ల్యాలలో పల్లె ప్రకృతి వనం, హైమాస్‌ లైట్లు, స్మశానవాటిక, చెత్త సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్‌లు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం కోస మే గ్రామాలకు పెద్ద మొత్తంలో సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించి గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పల్లెలన్నీ, పట్టణాలను తీర్చిదిద్దడానికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. మల్యాల గ్రామంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయకర్‌రావు చొరవతో రూ.60లక్షల ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌, జడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ చదువు రామచంద్రారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టె సుజాతరవీందర్‌, రైతు బంధు మండల కో ఆర్డినేటర్‌ నిదానపురం దేవయ్య, సర్పంచ్‌లు లంక రాజేశ్వరి, పుప్పాల నాగార్జున రావు, గోనె శ్యామ్‌, ఓరుగంటి కొమురయ్య, ఆరెల్లి సుజాతరమేష్‌, ఆకుల చిరంజీవి, ఎంపీటీసీలు గడ్డం రామచం ద్రం, గూడెపు జనార్ధన్‌రెడ్డి, కౌసల్య, సుముఖం నిర్మలమల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:28:18+05:30 IST