వార్షిక బొగ్గు ఉత్పత్తిపై జీఎం సమీక్ష

ABN , First Publish Date - 2022-10-08T05:29:44+05:30 IST

ఆర్‌జీ-1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి శుక్రవారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అన్నీ గనుల, డిపార్ట్‌మెంట్ల బాధ్యులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వార్షిక బొగ్గు ఉత్పత్తిపై జీఎం సమీక్ష
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జీఎం నారాయణ

గోదావరిఖని, అక్టోబరు 7: ఆర్‌జీ-1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి శుక్రవారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అన్నీ గనుల, డిపార్ట్‌మెంట్ల బాధ్యులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలకు సంబంధించి చేపట్టాల్సిన ప్రణాళికల ను అధికారులకు సూచించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకోవాలని, ఈనెల 10న 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌జీ-1 ఏరియాలో మైన్స్‌, ఓపెన్‌కాస్టు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకోవాల న్నారు. దీని కోసం 10న కమిటీ రానున్న నేపథ్యంలో గనుల వారీ చేపట్టాల్సిన ఉత్పత్తి లక్ష్యాలను, వార్షిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌ఓ టూ జీఎం రాంమోహన్‌, ఏజీఎం(ఫైనాన్స్‌) రామకృష్ణ, 11ఇంక్లైన్‌ గ్రూప్‌ ఏజెంట్‌ చిలుక శ్రీనివాస్‌, ఓసీపీ-5 పీఓ చంద్రశేఖర్‌, డీజీఎం(వర్క్‌షాప్‌) మదన్మోహన్‌, క్వాలిటీ జీఎం సలీం, అధికారులు ప్రభాకర్‌, బాల సుబ్రహ్మణ్యం, ఆంజనేయ ప్రసాద్‌, వసంత్‌, శ్రీనివాస్‌, వీరారెడ్డి, శ్రీనివాస్‌, నెహ్రూ, అనీల్‌ గబాలే, రమేష్‌బాబు తది తరులు పాల్గొన్నారు. 

Read more