పోలీసులకు పూర్తి స్వేచ్ఛ

ABN , First Publish Date - 2022-10-12T05:03:32+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, రాజకీయ జోక్యం లేదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ
పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తున్న హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

- ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో క్రైమ్‌ రేటు తగ్గింది

- దేశంలో 64 శాతం సీసీ కెమెరాలు తెలంగాణలోనే..

- హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

గోదావరిఖని, అక్టోబరు 11: శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, రాజకీయ జోక్యం లేదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరి రక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంగళ వారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కరీంనగర్‌ కమిషనర్‌  సత్యనారాయణ, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, కలెక్టర్‌ సంగీతసత్యనారా యణతో కలిసి రూ.8.4కోట్ల వ్యయంతో నిర్మించిన గోదావరిఖని వన్‌ టౌన్‌ మోడల్‌ పోలీస్‌స్టేషన్‌, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌, అంతర్గాం పోలీస్‌స్టేషన్‌ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, శాంతిభద్రతల సమస్యల ఉత్పన్నమవుతుం దని అపోహలు సృష్టించారన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజకీయ జోక్యం లేకుండా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తద్వారా అపోహలను పటాపంచలు చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌ స్టేట్‌గా ఎదిగిం దన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటేనే పెట్టుబడులు వస్తా యనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రూ.700 కోట్లతో పోలీసులకు పెట్రోలింగ్‌ వాహనాలు అందించారని, డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టార న్నారు. డయల్‌ 100 వ్యవస్థను పటిష్ఠ పరిచారని, పట్టణాల్లో అయితే ఫిర్యాదు వచ్చిన ఐదు నిమిషాల్లో పోలీసులు చేరుతున్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లో విశ్వాసం కల్పిం చారన్నారు. మహిళలకు నియామకా ల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ ఇవ్వడం ద్వారా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ కౌంటర్‌లో మహిళా సిబ్బంది ఉంటున్నారని, దీంతో మహిళలు తమగోడు చెప్పు కునేందుకు ఠాణాల కు వస్తున్నారన్నారు. షీటీంలు పక డ్బందీగా పని చేస్తున్నాయన్నారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వసతులు పోలీస్‌శాఖకు అందిస్తున్నామని, దేశం లో ఎక్కడా లేని విధంగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేశా మ న్నారు. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న సీసీ కెమెరాల్లో 64శాతం రాష్ట్రం లో  ఏర్పాటు చేశారని, వీటిని పోలీస్‌స్టేషన్లకు, కమాండ్‌ అండ్‌ కంట్రో ల్‌కు అనుబంధం చేశారన్నారు. ఎమ్మెల్యే చందర్‌ కోరిక మేరకు గోదా వరిఖనిలో మహిళా పోలీస్‌ స్టేషన్‌, మంత్రి ఈశ్వర్‌ విజ్ఞప్తి మేరకు ధర్మపురి నియోజకవర్గంలో సర్కిల్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని, ఠాణా లకు వచ్చే వారితో మర్యదగా వ్యవహరించాలని, న్యాయబద్దంగా, ధర్మ బద్దంగా విధులు నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గోదా వరిఖని ప్రాంతం రాష్ట్ర అభివృద్ధిలోనే ప్రాధాన్యత కలిగి ఉందని, ఇక్కడ కార్మికులు కష్టపడి అందించే బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుం దన్నారు. పోలీస్‌స్టేషన్‌ ఒక దేవాలయం లాంటిదని, ప్రజలు స్టేషన్లకు వచ్చినప్పుడు మాది అనే భావన కల్పించాలన్నారు. పోలీస్‌ సేవల్లో నాణ్యత పెరగాలని ఆయన పేర్కొన్నారు. మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవ నంలో అన్నీ రకాల వసతులు అందుబాటులో ఉన్నాయ న్నారు. వీటిని వినియోగించుకుని సమర్థవంతమైన సేవలు అందించా లని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌, గెస్ట్‌హౌస్‌ రల నిర్మాణా నికి సహకరించిన సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ అధికారులకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కమిష నరేట్‌ కూడా అందుబాటులోకి రానున్నదన్నారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ పట్టణంలో యువత చెడుమార్గాలకు వెళ్లకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార న్నారు. గోదావరిఖని పట్టణంలో ఆధునికంగా మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మించుకున్నామని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్‌ చొరవతో రూ.3.4కోట్ల వ్యయంతో పోలీస్‌ గెస్ట్‌హౌస్‌, 3.5కోట్లతో మోడల్‌ పోలీస్‌స్టేషన్‌, రూ.1.5కోట్లతో అంతర్గాం పోలీస్‌ స్టేష న్లు నిర్మించామన్నారు. ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నుంచి 3.4 కోట్లు, సింగరేణి సీఎస్‌ఆర్‌ నుంచి రూ.3.5కోట్లు ఇప్పించారన్నారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మాణ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎస్‌పీ చేతన, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌, మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కమిషనర్‌ సుమన్‌రావు, ఎన్‌టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్‌, పెద్దపల్లి డీసీపీ రూపేష్‌, సింగరేణి డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారాయణ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ సీఈ విజయ్‌కుమార్‌, ఈఈ శ్రీనివాస్‌, ఏఈ సాయిచంద్‌, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, ప్రసాద్‌రావు, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప, కల్వల శిరీష పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T05:03:32+05:30 IST