క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
ABN , First Publish Date - 2022-08-19T05:51:52+05:30 IST
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.

-కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు18: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు గురువారం అంబేద్కర్ స్టేడియంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణలు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అండర్-17 బాలుర వాలబాల్, బాలికల ఖో-ఖో పోటీలను వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల్లో దాదాపు 980 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీల విన్నర్, రన్నర్లతోపాటు పోలీస్, కలెక్టర్ టీంలకు షీల్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ ప్రతాప్, జిల్లా ప్రణాళికా అధికారి కొమురయ్య, జిల్లా క్రీడాధికారి రాజవీరు, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి పాల్గొన్నారు.