మహనీయుల అడుగుజాడల్లో నడుచుకోవాలి

ABN , First Publish Date - 2022-08-16T06:31:15+05:30 IST

స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి అమరులైన మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

మహనీయుల అడుగుజాడల్లో నడుచుకోవాలి
మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 15: స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి అమరులైన మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం  ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాద్‌కా గౌరవ్‌ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 మీటర్ల జాతీయ జెండాతో కాంగ్రెస్‌ నాయకులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా చేపట్టిన తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. ఇందిరా గాంఽధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, సర్ధార్‌ వల్లాబాయ్‌ పటేల్‌, మహాత్మాగాంధీ విగ్రహాలకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పూలమాలలు వేసి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఓగ్గుడోలు నృత్యాలు, మహిళల మంగళ హారతులుతో యాత్రను గాంధీనగర్‌వరకు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకులు ఇంధిరా, రాజీవ్‌ గాంధీలు అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని వివరించారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పోటీ పడి ప్రజలపై అప్పుల భారం మోపుతూ పాలనను కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, టీపీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొత్త మోహన్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయ లక్ష్మి, ప్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గుండ మధు, సీనియర్‌ నాయకులు గాజుల రాజేందర్‌, పుప్పాల అశోక్‌, తాడెపు రమణ, మన్సూర్‌, జగదీశ్వర్‌, నేహాల్‌, రియాజ్‌, రాజేష్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-16T06:31:15+05:30 IST