జ్వరం..మరణం

ABN , First Publish Date - 2022-09-20T05:23:42+05:30 IST

రాయికల్‌ మండలంలోని పలు గ్రామాలను ఓ వైపు డెంగ్యూ, మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి.

జ్వరం..మరణం

రాయికల్‌ మండలంలో 10రోజుల్లో 9మంది మృతి

మృతుల్లో 4గురు చిన్నారులు

పత్తా లేని వైద్య శిబిరాలు

==================

రాయికల్‌ మండలంలోని పలు గ్రామాలను ఓ వైపు డెంగ్యూ, మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాల బారిన పడి చిన్నారులతో పాటు పెద్ద వారు సైతం మృత్యువాత పడటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జ్వరం వచ్చిన కొద్ది రోజులకు తేరుకోవడం అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. గడిచిన పది రోజుల్లో 9 మం ది మృతి చెందారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్ల చుట్టూ నీరు చేరి దోమలు వృద్ధి చెంది డెండ్యూ జ్వరాలకు దారి తీస్తున్నాయనేది మరో వాదన. వీటితో పాటు గ్రామాల్లో కనీస వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.  

రాయికల్‌, సెప్టెంబరు 19: రాయికల్‌ మండలంలోని పలు గ్రామాలను డెంగ్యూ, విషజ్వ రాలు వణికిస్తున్నాయి. మండలంలో గడిచిన పది రోజుల్లో నలుగురు చి న్నారులు, నలుగురు యువకులు, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బం ది డెంగ్యూ, విషజ్వరాలపై గ్రామాలలో పూర్థి స్థాయిలో అవగాహన కల్పిం చక పోవడంతో మరణాలు పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. డెంగ్యూ, విషజ్వరాల లక్షణాలగురించి ప్రజలకు పూర్తిగా తెలియక పోవడంతో సాధారణ జ్వరంలాగా స్థానిక ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స పొంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. 

ఆలస్యంగా స్పందించడంతో మరణాలు

మండలంలోని చాలామంది తమకు జ్వరం రావడంతో స్థానిక వైద్యు లపై ఆధారపడి చికిత్స చేయించుకుంటున్నారు. పరిస్థితి విషమంగా మా రి పట్టణాలకు వెళ్లేలోపు చనిపోతున్నారు. రక్త పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో పెద్దాసుపత్రులకు వెళ్లినా ఫలితం లేకపోవ డం కూడా మరో కారణంగా తెలుస్తోంది. రాయికల్‌ పట్టణానికి చెందిన శృతి నాలుగు రోజుల నుంచిజ్వరంతో బాధపడుతూ తగ్గకపోవడంతో కు టుంబ సభ్యులు జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వి విధ రకాల పరీక్షలు చేసిన వైద్యులు శృతికి డెంగీగా నిర్ధారించారు. కానీ అప్పటికే చేయిదాటిపోయి శృతి పరిస్థితి విషమించిందని హైదరాబాద్‌ తీ సుకువెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో బాలికను సెప్టెంబరు 17న హై దరాబాద్‌ తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తల్లిదం డ్రులు తెలిపారు. ఇటీవల జ్వరాలతో మృతి చెందిన వారందరూ కూడా ఆలస్యంగా స్పందించడంతోనే ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తోంది.  

ప్రభుత్వాసుపత్రిలో పనిచేయని పరికరాలు

రాయికల్‌ మండల వ్యాప్తంగా గ్రామాలలో విష జ్వరాలు, డెంగ్యూ జ్వ రాలు ప్రబలుతున్నా టెస్టుల కోసం రాయికల్‌ పట్టణంలోని ప్రభుత్వాసు పత్రికి వస్తే అక్కడ రోగ నిర్థారణ పరికరాలు పనిచేయడం లేదని ప్రైవే టు ఆసుపత్రులకు పంపుతున్నారు. డెంగ్యూ పరీక్షల నిమిత్తం ప్లేట్లెట్స్‌ మి షన్‌ అసుపత్రిలో ఉన్నప్పటికీ అది చెడిపోయి ఏళ్లు గడుస్తున్నా వినియో గంలోకి తీసుకురావడం లేదు.

డెంగ్యూ లక్షణాలు

నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్ల మధ్య నీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ లోపం, ప్రజలకు అ వగాహన కల్పించకపోవడం డెంగ్యూ కారకాలుగా మారుతున్నాయి. ఇప్ప టికైనా అధికారులు, వైద్య సిబ్బంది స్పందించి గ్రామాలలో క్యాంపులు ఏ ర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతు న్నారు. డెంగ్యూ వచ్చిన వారిలో ముఖ్యంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వ రం ఎక్కువగా వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. జ్వరం వచ్చిన వెం టనే ఎలాంటి భయాందోళనలకు గురికాకుండాఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షల్లో డెంగ్యూ అని నిర్ధారణ అయితే వైద్యుల సూచ నల మేరకు మందులు వాడాలి.

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్‌

రాయికల్‌ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో జ్వరాల నియంత్రణకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ఖాళీ స్థ లాలు, గుంతలలో నిలిచిన నీటిని తొలగించడానికి ప్రత్యేక చర్యలు చేప డుతున్నాం. గ్రామాలలో క్లోరినేషన్‌, ఆంటీ లార్వా స్ర్పే ఫాగింగ్‌ చేస్తు న్నాం.  పట్టణంలో ఖాళీ స్థలాల్లో నీరు నిలువ ఉండకుండా  ఆయా స్థలా ల యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. గ్రామాలలో మురికి నీటి కా లువలకు ప్రతిపాదనలు పంపాము. 

Read more