లింగంపేటలో రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-11-19T00:30:49+05:30 IST

కొనుగోలు కేంద్రంలో ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని మండలంలోని లింగంపేటలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు.

 లింగంపేటలో రైతుల రాస్తారోకో
లింగంపేటలో రాస్తారోకో చేస్తున్న రైతులు

చందుర్తి, నవంబర్‌ 18 : కొనుగోలు కేంద్రంలో ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని మండలంలోని లింగంపేటలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 43 కిలోలు తూకం వేస్తున్నారన్నారు. 41 కిలోలు మాత్రమే తూకం వేయాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు చిలుక పెంటయ్య, నాయకులు గాజుల సత్తయ్య, ఎల్ల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:30:49+05:30 IST

Read more