వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం లాంటి వ్యక్తి దేశంలోనే లేరు: ఈటల
ABN , First Publish Date - 2022-05-01T18:26:48+05:30 IST
వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశంలోనే లేరని ఈటల రాజేందర్ అన్నారు.

కరీంనగర్ జిల్లా: కోటి ఎకరాల మాగాణికి నీళ్లు రావట్లేదని, వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశంలోనే లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన హుజురాబాద్లో మీడియాతో మాట్లాడుతూ 40 కిలోల బస్తాకి 43 కిలోల తూకం వేస్తున్నారని, ఓ చేత్తో రైతుబంధు ఇచ్చి.. మరో చేత్తో దోచుకుంటున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టపై పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రగతిభవన్లో కూర్చుని ఇతర రాష్ట్రాలను విమర్శిస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.