కేజీ టు పీజీ సముదాయం ఏర్పాటు ఈ ప్రాంతవాసుల అదృష్టం

ABN , First Publish Date - 2022-12-31T23:34:06+05:30 IST

గంభీరావుపేటలో కేజీ టు పీజీ సముదాయం ఏర్పాటు ఈ ప్రాంతవాసుల అదృష్టమని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

కేజీ టు పీజీ సముదాయం ఏర్పాటు ఈ ప్రాంతవాసుల అదృష్టం
గంభీరావుపేటలో మాట్లాడుతున్న నాఫ్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, డిసెంబరు 31: గంభీరావుపేటలో కేజీ టు పీజీ సముదాయం ఏర్పాటు ఈ ప్రాంతవాసుల అదృష్టమని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాలయంలో శనివారం పీజీ ప్రఽథమ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంభీరావుపేటలో కేజీ టు పీజీ సముదాయం ఏర్పాటు దేశంలోనే చారిత్రాత్మకమన్నారు. పలకతో వచ్చి పీజీ పట్టాతో వెళ్లే సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒకే చోట ప్రాంగణాన్ని నెలకొల్పిందన్నారు. మొట్ట మొదటగా 17 ఏళ్లపాటు ఒకే చోట చదువుకునే అవకాశం విద్యార్ధులకు లభించడం మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితమేనన్నారు. గతంలో ఉన్నత విద్యాభ్యాసానికి విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లేవారని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక క్రమంగా ఆ కష్టాలన్ని తీరిపోతున్నాయని అన్నారు. విద్యార్ధుల భవిష్యత్‌ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద విద్యాసంస్ధలను ఏర్పాటు చేస్తోందని, ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతంగా స్థాయికి ఎదిగి, తల్లిదండ్రులకు, ఊరుకు మంచి పేరు తేవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా విద్యా, వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల వారీగా విద్యకు సంబంధించి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. సామాన్య ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు, కళాశాల ప్రిన్సిపాల్‌ పిట్ల దాసు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకటస్వామి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్‌ డైరెక్టర్‌ గౌరినేని నారాయణరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుతారి బాలవ్వ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు, గజసింగవరం సర్సంచ్‌ బాలరాజు, ఉప సర్పంచులు నాగరాజు, దేవేంద్రం, వార్డుసభ్యులు రాజనర్సు, శ్రీమతి, నాయకులు సురేందర్‌రెడ్డి, లక్ష్మణ్‌, రాజు, వెంకటి, లింగం యాదవ్‌, కమలాకర్‌రెడ్డి, మీనయ్య, ఎగదండి స్వామి, సలీం, భిక్షపతి ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:34:13+05:30 IST