సెల్‌ఫోన్‌కే విద్యుత్‌ బిల్లు

ABN , First Publish Date - 2022-12-12T01:15:33+05:30 IST

విద్యుత్‌ వినియోగదారు లకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు ఆన్‌లైన్‌ సేవలను విస్తృతం చేస్తు న్నారు.

 సెల్‌ఫోన్‌కే విద్యుత్‌ బిల్లు

- బిల్లర్ల సెల్‌ఫోన్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌

- ఆన్‌లైన్‌లోనే వినియోగదారుడి చెల్లింపులు

గణేశ్‌నగర్‌, డిసెంబరు 11: విద్యుత్‌ వినియోగదారు లకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు విద్యుత్‌ శాఖ అధికారులు ఆన్‌లైన్‌ సేవలను విస్తృతం చేస్తు న్నారు. రీడింగ్‌ నమోదు, ఆన్‌లైన్‌లో బిల్లుల అప్‌ లోడింగ్‌కు జాప్యం జరుగుతుండటంతో వినియోగదారుల కు ఆన్‌లైన్‌లో బిల్లులు కనిపించేందుకు రెండు మూడు రోజుల సమయం పట్టేది. దీన్ని అధిగమించి రీడింగ్‌ తీసిన వెంటనే వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో కనిపించే విధంగా చర్యలు చేపట్టారు. జనవరి నుంచి దీన్ని అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటి వరకు విద్యుత్తు సిబ్బంది మీటర్‌ నుంచి అనలాజిక్‌ పరికరం ద్వారా రీడింగ్‌ సేకరించి నమోదు చేయగానే బిల్‌ వస్తుంది. ఇందులో ఇదివరకటి రీడింగ్‌ సహా ప్రస్తుత యూనిట్లు తదితర వివరాలు ఉంటాయి. ఈ బిల్లును తర్వాత సర్వర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేసేవారు. తర్వాత వినియోగదారులు ఆన్‌లైన్‌ బిల్లులు చెల్లించేవారు. సాధారణంగా ఒక్కో బిల్లు అన్‌లోడ్‌ చేసేం దుకు ముప్పై సెకన్ల వ్యవధి పట్టేదని ఓ ఇంజినీర్‌ తెలి పారు. సాంకేతిక కారణాలు, సర్వర్‌ సరిగా స్పందించక పోవడం, సంకేతాలు అందకపోవడం తదితర కారణా లతో ఒక్కోసారి అప్‌లోడ్‌కుమూడు, నాలుగు రోజుల వ్యవధి పట్టేది. కొన్ని బిల్లులు ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ కాక పోయేది. దీంతో విద్యుత్తు బిల్లులు ఆన్‌లైన్‌లో చూపిం చడం లేదని కొందరు వినియోగదారుల నుంచి ఫిర్యాదు అందేది. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యుత్తు శాఖ కసరత్తు చేసింది.

ప్రతినెలా మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసే ఉద్యోగుల చరవాణులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అందించనున్నారు. వీరు చరవాణితో మీటర్‌ రీడింగ్‌ నమోదు చేయగానే బిల్‌ రావడంతో పాటు సర్వర్‌ ద్వారా వెంటనే వినియోగ దారుడి చరవాణికి బిల్లు అప్‌లోడ్‌ అవుతుంది. దీంతో విద్యుత్‌ సిబ్బందికి ఎంతో సమయం కలిసివస్తుంది. వినియోగదారుడు కూడా వెంటనే బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే వారికి ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందుకు అవసరమైన యాప్‌లను సిబ్బంది చరవాణిలకు అంది స్తారు. జిల్లాలో సుమారు ముడూ లక్షల యబైవేల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. జనవరి నుంచి కొత్త పద్ధతిలో మీటర్‌ రీడింగ్‌, విద్యుత్తు బిల్లులు నమోదు చేసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌ ద్వారా బిల్లుల చెల్లింపులకు

ఇబ్బందులు ఉండవు : ఎస్‌ఈ గంగాధర్‌

ఇదివరకు విద్యుత్‌ బిల్లు రీడింగ్‌ సరిగా రాకపోవడంతో ప్రతినెలా 17,18 తేదీలలో పూర్తయ్యేది. కొన్ని బిల్లులు రీడింగ్‌ తప్పు వచ్చిందని గతంలో వచ్చిన బిల్లు మళ్లీ వచ్చిందని దృష్టికి వచ్చాయి. ఇకపైన అలాంటి ఇబ్బందు లు లేకుండా చూస్తున్నాం. ప్రతి నెల పదో తేదీ లోపల జిల్లా వ్యాప్తంగా బిల్లులు పూర్తి చేసి వినియోగదారుల కు ఆందజేస్తాం. ఆన్‌లైన్‌ ద్వారానే బిల్లులు చెల్లించవచ్చు.

Updated Date - 2022-12-12T01:15:33+05:30 IST

Read more