మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2022-10-03T06:04:09+05:30 IST

మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా కోతి రాంపూర్‌లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ సునీల్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయలతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ ఆశయ సాధనకు కృషి

- మంత్రి గంగుల కమలాకర్‌ -జిల్లా వ్యాప్తంగా గాంధీజీకి ఘన నివాళి

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు2: మహాత్మాగాంధీ  ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌  అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా కోతి రాంపూర్‌లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ సునీల్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయలతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ పాల్గొన్నారు.

-కరీంనగర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మేయర్‌ సునీల్‌ రావు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌, కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ పాల్గొన్నారు. 

-జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి సుజయ్‌ నగరంలోని ప్రభుత్వ వృద్ధుల, వికలాం గుల వసతిగృహంలో పండ్లు పంపిణీ చేశారు.  

-కరీంనగర్‌ రూరల్‌ మండలం తీగలగుట్టపల్లిలోని సహాయ ఆశ్రమంలో నిర్వాహకులు గుర్రం పద్మారెడ్డి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.  

-కరీంనగర్‌ అర్బన్‌: డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

-కరీంనగర్‌ రూరల్‌: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బాపూజీ యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. 

- దుర్శేడ్‌ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ నాయకుడు మేనేని రోహిత్‌రావు పాల్గొన్నారు.

- ఆసిఫ్‌నగర్‌ గ్రామంలోని గాంధీ విగ్రహానికి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెడ్డవేణి మధు, సర్పంచ్‌ కడారి శాంత శ్రీనివాస్‌ నివాళులర్పించారు. 

-హుజూరాబాద్‌/రూరల్‌/శంకరపట్నం/వీణవంక/ఇల్లందకుంట/సైదాపూర్‌/గంగాధర/మానకొండూర్‌/చొప్పదండి/రామడుగు: డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల్లో  నాయకులు, అధికారులు గాంధీ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

Read more