పేదల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2022-03-05T06:30:07+05:30 IST
పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం, మార్చి 4: పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లాపూర్ గురుకుల విద్యాలయాన్ని మంత్రి తనిఖీ చేశారు. విద్యాలయంలొ మౌలిక సదుపాయాల గురించి మంత్రి బాలికలను అడిగి తెలుసుకున్నారు. భోజ నశాలను, శిథిలావస్థకు చేరుకున్న గదులను మంత్రి పరిశీలించారు. విద్యాలయంలో పరిశుభ్ర తను పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపా ల్కు సూచించారు. ధర్మారంలో స్టార్ మహిళ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నందిమేడారంలో గల సామాజిక ఎస్సీ భవన నిర్మాణానికి ఆయన శం కుస్థాపన చేశారు. గ్రామంలో నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. దొంగతుర్తి గ్రామం లో పలు అబివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాసన చే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నంది మేడారం సింగిల్విండ్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, పత్తి పాక సింగిల్విండో చైర్మన్ నోముల వెంకట్రెడ్డి, సర్పంచ్లు సామంతుల జానకీ, సత్తయ్య, ఎంపీటీసీలు పాల్గొన్నారు.