ప్రభావిత ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-12-15T00:35:38+05:30 IST

ఎన్టీ పీసీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాభి వృద్ధి కృషి చేస్తున్నామని రామగుం డం ఎన్టీపీసీ ఈడీ సునీల్‌కుమార్‌ అన్నారు.

ప్రభావిత ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి

జ్యోతినగర్‌, డిసెంబరు 14 : ఎన్టీ పీసీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాభి వృద్ధి కృషి చేస్తున్నామని రామగుం డం ఎన్టీపీసీ ఈడీ సునీల్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఈడీసీలో ప్రభా విత ప్రాంతంలోని 4 మండలాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను ఈడీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ ఎన్టీపీసీ చుట్ట పక్కల ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను కల్పిస్తున్నామని, సీఎస్‌ఆర్‌ పథకం ద్వారా అదనపు తరగతి గదులు, ప్రహరీ, టాయ్‌లె ట్లను నిర్మించామన్నారు. అలాగే పాఠ శాలల్లో బెంచీలు, క్రీడా సామగ్రి తదితర ఉపకరణాలను అంద జేస్తున్నామని ఆయన తెలిపారు. గత దశాబ్ధ కాలంగా ప్రతి ఏటా చుట్టు పక్కల అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. బాలికలకు సైకిళ్లను, మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇస్తున్నామని తెలిపారు. ఎన్టీపీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈడీ సునీల్‌కుమార్‌ ఆకాంక్షించారు. అనంతరం నాలుగు మండలాల పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాల లకు చెందిన 4609 మంది విద్యార్థులకు 18,436 నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం(హెచ్‌వోహెచ్‌ఆర్‌) విజయలక్ష్మి, సీఎస్‌ఆర్‌ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:35:42+05:30 IST