అంబరాన్నంటిన దసరా సంబరాలు

ABN , First Publish Date - 2022-10-07T05:41:45+05:30 IST

జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.

అంబరాన్నంటిన దసరా సంబరాలు
జంబిగద్దె వద్ద మహిషాసురుని దహనం

జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు

వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 6 : జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆల యం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంబి గద్దె వద్దకు తీసుకువచ్చారు. జంబి గద్దె లోపల శమీ వృక్షాన్ని నెలకొల్పారు. బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌ కుమార్‌, గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, కమిషనర్‌ గంగాధర్‌, తహసీల్దార్‌ ఆరీఫోధ్దీన్‌, డీ టీ రాజేందర్‌ రావు, వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు హాజరై శమీ వృ క్షానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్‌ పర్సన్‌ శ్రావణి విజయద శమి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తె లుపుకున్నారు. అలాగే జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయుధ, వాహన పూజ కార్యక్రమాన్ని ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఫజగిత్యాలలో మహిషాసురుని దహనం వైభవంగా జరిగింది. నవదుర్గ, కనక దుర్గ సేవా సమితిల ఆధ్వర్యంలో మహిషాసురుని ప్రతిమను ఊరే గింపుగా తీసుకువచ్చి మేళతాళాల మధ్య టపాసులు పెట్టి పేల్చారు. 

రాయికల్‌: రాయికల్‌ మండలంలో బుధవారం దసరా వేడుకలు ఘనం గా జరిగాయి. ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సా యంత్రం షమీ పూజల్లో పాల్గొని జంబిఆకు ఒకరికి ఒకరు ఇచ్చుకుని పండగశుభాకాంక్షలు తెలుపుకున్నారు.

దసరా ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర సంహారం భక్తులు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ విగ్రహం వద్ద దుర్గమ్మ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా మహిషాసుర సంహారం చేసింది. మహిషాసుర సంహార అనంతరం దుర్గమ్మను నిమజ్జనానికితరలించారు. ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఆ ధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ చైర్మ న్‌ మోర హన్మాండ్లు, కౌన్సిలర్లు ఎలాంటి అవాంతరాలు జరగకుండా  చర్యలు తీసుకున్నారు.

 శమిపూజలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల

కోరుట్ల: పట్టణంలో బుధవారం దసరా వేడుకలు ప్రజలు ఘనంగా ని ర్వహించుకున్నారు. జంబి ఆకు పంచుకుంటూ ఒకరినొకరు దసరా శుభా కాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలో జరిగిన శమిపూజ మహోత్సవంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రత్యేక పూజలో పాల్గొని వేడుకలను ప్రారంభించారు.  పట్టణంలోని దుర్గాదేవి విగ్రహాలను పట్టణంలో పురవీధుల గుండా ఊరేగిం చి కాల్వగడ్డ ప్రాంతంలో మహిషాసుర మర్దనం నిర్వహించారు. అనంతరం దుర్గాదేవిలను స్థానిక వాగులో నిమజ్జనం చేశారు. వెంకటేశ్వర, అష్టలక్ష్మి, అయ్యప్ప దేవాలయాల్లో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు(శమీపూజ) నిర్వ హించారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి వారు అశ్వవాహనం ఊరేగగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వెంకటేశ్వర దేవలంయలో శమి పూజ వేడుకలో టీఆర్‌ఎస్‌ నాయకుడు డా. సంజయ్‌ దంపతులు పాల్గొన్నారు. 

ధర్మపురిలో శమీ వృక్ష పూజలు

గౌరవ వందనంగా తుపాకితో గాలిలోకి కాల్పులు

ధర్మపురి: ధర్మపురి క్షేత్రంలో దసరా ఉత్సవాలు బుధవారం అత్యంత వై భవంగా నిర్వహించారు. సాయంత్రం వేళలో ఉత్సవ మూర్తులను సేవల పై ఆశీనులు చేశారు. అనంతరం స్వామి వారల సేవలను నూతన జమ్మి గద్దె వరకు ఊరేగించారు. ఆలయ వేద పండితులు సాంప్రదాయ రీతిలో శ మీ వృక్ష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారలను దర్శించుకున్నారు. ఏటా నిర్వహించే విధంగా సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ గౌరవ వందనంగా తుపాకితో రెండు సార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అటు పిదప స్వామి వారల సేవలను అక్కడి నుంచి ఇసుక స్తం భం వరకు ఊరేగింపు జరిపారు. ఇసుక స్తంభం వద్ద గల మండపంలో ప్ర త్యేక పూజలు అనంతరం స్వామి వారల సేవలను తిరిగి ఆలయానికి తీసుక వచ్చారు. అంతకు ముందు ఆలయ అర్చకులకు దీక్షా వస్త్రాలను సమర్పించారు. భక్తులు శమీ ఆకును చేత ఇచ్చి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడు కలు ఘనంగా నిర్వహించారు. గోదావరి నదీ తీరాన గల శ్రీ శివసాయి బాలాజీ ఆలయంలో అర్చకులు స్వామి వారలకు క్షీరాభిషేకం జరిపారు. ఆ లయం పక్షాన స్థానిక బస్‌స్టేషన్‌ ఆవరణలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, వైస్‌చైర్మన్‌, ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇం దారపు రామయ్య, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, సీనియర్‌ అసి స్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:41:45+05:30 IST